పేదరికం కొలమానాలు - సమీక్ష
కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటారు. భారత్ లాంటి వర్థమాన దేశాల్లో సమాజంలోని సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయడంలో శతాబ్ధాలుగా రాజకీయ, ఆర్థిక విధానాలు పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోవడంతో స్వాతంత్ర్యం సిద్ధించి 66 ఏళ్లు పూర్తయినా దేశంలో దారిద్ర్యం తాండవిస్తూనే ఉంది. తలల లెక్కింపు పద్ధతి ద్వారా పేదరికాన్ని అంచనా వేస్తుండటం వల్ల జనాభా పెరిగే కొద్దీ పేదల సంఖ్య మొత్తం జనాభాలో పెరుగుతూనే ఉంది. సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ పేదరికాన్ని మాత్రం పూర్తిగా నిర్మూలించ లేకపోవడం శోచనీయం.
భారతదేశంలో పేదరికాన్ని నిర్దిష్ట పేదరికం, సాపేక్ష పేదరికం అని రెండు రకాలుగా నిర్వచిస్తారు. నిర్దిష్ట పేదరికాన్ని పరిగణించేటప్పడు కనీస జీవన ప్రమాణాల్లోని వివిధ అంశాలను నిర్దిష్ట పరిమాణంలో పరిగణనలోకి తీసుకొని, ఆ పరిమాణానికి దిగువన ఉన్న వ్యక్తులందరినీ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారిగా గుర్తిస్తారు. వివిధ వ్యక్తులు లేదా సమూహాలకు అందుబాటులో ఉన్న వనరులు, వేతనం, సంపద తదితరాల్లో అసమానతల ఆధారంగా సాపేక్ష పేదరికాన్ని లెక్కిస్తారు. భారత్ లో పేదరికం సాధారణంగా నిర్దిష్ట పేదరికం. నిర్దిష్ట పేదరిక లెక్కింపునకు దారిద్ర్యరేఖ అనే భావనను దాదాభాయి నౌరోజీ మొదటిసారిగా “పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా” అనే గ్రంథంలో జైల్లో ఖైదీల కనీస పౌష్టికాహారం ఆధారంగా నిర్వచించారు. 1940, 1950లలో కలకత్తాలోని ఇండియన్ స్టాటికల్ ఇనిస్టిట్యూట్ రూపకర్త మహాలనోబిస్ శాంపుల్ సర్వే ద్వారా పేదరికాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. ఈ పద్ధతిని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ లో ప్రవేశపెట్టారు.
పేదరికం – విభిన్న ప్రాతిపదికలు, వైవిధ్య అంచనాలు:
భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఆర్థిక వేత్తలు వివిధ అంశాలను (కేలరీలు, నెలసరి వ్యయం, వార్షికాదాయం) ప్రాతిపదికగా తీసుకున్నారు.
1. పి.డి. ఓఝా కమిటీ నివేదిక (1960 -61):
ఆహారంలో దినసరి పౌష్టిక విలువల ఆధారంగా పి.డి ఓఝా కమిటీ దారిద్ర్య రేఖను నిర్వచించింది. సగటున మనిషికి రోజుకు 2,250 కేలరీలను ప్రామాణికంగా తీసుకుంది. అంటే రోజుకు 2,250 కేలరీల శక్తినిచ్చే ఆహారం లభించని వారు దారిద్ర్యరేఖ దిగువనున్నవారని లెక్క. ఈ విలువను రూపాయి మారకంలోకి మార్చి 1960-61 ధరల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 నుంచి రూ.18, గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 నుంచి రూ.11 నెలసరి వేతనం కంటే తక్కువ ఉంటే దాన్ని దారిద్ర్య రేఖగా నిర్వచించారు. దీని ప్రకారం 1960-61 నాటికి దేశంలో 44 శాతం మంది పేదలే. 1967-68 లలో గ్రామీణ ప్రాంతాల్లో 70శాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు.
2. దండేకర్ -రథ్ అధ్యయన బృందం (1960 -61):
దండేకర్ -రథ్ బృందాన్ని ప్రణాళిక సంఘం నియమించింది. ఓఝా కమిటీ సూచించిన 2,250 కేలరీల దినసరి పౌష్టిక విలువతో ఈ బృందం ఏకీభవించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వారు నిర్వహించే విధులను అనుసరించి వేర్వేరు పౌష్టిక విలువల ఆధారంగా దారిద్ర్యరేఖను నిర్వహించాలని సూచించింది. ఈ అధ్యయన బృందం ప్రకారం పట్టణ ప్రాంతాల వారికి 2,100 కేలరీలు, గ్రామీణ ప్రాంతాల వారికి 2,400 కేలరీలు శక్తితో సమానమైన పోషక విలువలు అవసరం. దీనికంటే తక్కువగా ఉండే వారు పేదరికంలో ఉన్నట్లుగా భావించారు. 1968-69 ధరల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.324, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.486 కంటే తక్కువ ఆదాయాన్ని దారిద్ర్యరేఖగా పేర్కొంది. దీన్ని అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం ప్రజలు, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం కంటే అధిక జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు.
3. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన పౌష్టికాహార నిపుణుల గ్రూపు 1968లో కనీస దినసరి తలసరి కేలరీల వినియోగ ప్రమాణాన్ని ప్రతి మనిషికి సగటున 2,250 కేలరీలుగా నిర్ధారించింది. దీనిలో పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులకు 2,100 కేలరీలుగా గ్రామీణ ప్రాంతాలలోని వ్యక్తులకు 2,400 కేలరీలుగా నిర్ధారించింది.
4. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అధ్యయనం:
1956 -57 నుంచి 1973 -73 మధ్యకాలంలో పేదరిక పరిమాణంలో వచ్చిన మార్పులను మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అధ్యయనం చేశారు. 1960 -61 ధరల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.15ను, పట్టణ ప్రాంతాల్లో రూ.20 నెలసరి వ్యయాన్ని దారిద్ర్యరేఖగా పరిగణించారు. స్థూల జాతీయోత్పత్తిని పెంచడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఆయన ప్రతిపాదించారు.
5. ఏడో ఆర్థిక సంఘం నివేదిక:
ఈ సంఘం పేదరికాన్ని లెక్కించేందుకు విస్తృత దారిద్ర్యరేఖ (Augmented Poverty Line) అనే భావనను ప్రతిపాదించింది. దీనిలో సూచించిన వివిధ అంశాలు.. సురక్షిత నీటి సరఫరా, కనీస విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, పౌష్టికాహారం, రోడ్డు వసతి. ఆయా అవసరాల కోసం ప్రతీ వ్యక్తి పెట్టే కనీస నెలసరి వ్యయం ఆధారంగా దారిద్ర్యరేఖను నిర్వచించాలి. 1970-71 ధరల ఆధారంగా 52 శాతం జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లుగా ఈ సంఘం లెక్కించింది.
6. మిన్హాస్ అధ్యయన బృందం (1987 -88):
మిన్హాస్, జైన్, టెండూల్కర్ సభ్యులుగా ఉన్న ఈ బృందం కొనుగోలు సామర్థ్యం ఆధారంగా దారిద్ర్య రేఖను నిర్వచించింది. దేశంలో పేదరికం శాతం 42.7 గా నిర్ధారించింది.
7. లక్డావాలా కమిటీ (1993 -94):
లక్డావాలా కమిటీని 1989లో ప్రణాళిక సంఘం నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1993లో సమర్పించింది. సమాజంలో వివిధ వర్గాల కొనుగోలు సామర్థ్యాన్ని గుర్తించేందుకు ప్రమాణాలైన వ్యవసాయ కూలీల వినియోగ ధరల సూచీ, పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచీ, నాన్ మాన్యువల్ ఎంప్లాయిస్ వినియోగ ధరల సూచీలను ఉపయోగించి దారిద్ర్యరేఖను నిర్వహించింది. కొనుగోలు సామర్థ్యం ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.49, పట్టణ ప్రాంతాల్లో రూ.57 నెలసరి వ్యయాన్ని దారిద్ర్యరేఖగా సూచించింది. ఈ గణాంకాల ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రజల శాతం 1983లో 45 శాతానికి 1988లో 39.3 శాతానికి తగినట్లుగా కనిపిస్తోంది, గతంలో వినియోగించిన గణాంకాలకు, లక్డావాలా కమిటీ గణాంకాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్ర ప్రత్యేక ధరల సూచీ సంఖ్యలు ఆధారంగా చేసుకొని కనీస వినియోగ పోషక పదార్థాల ధరల రేఖలో మార్పులు చేయాల్సి ఉంటుందని లక్డావాలా కమిటీ సూచించింది.
8. ఆరో పంచవర్ష ప్రణాళిక:
పౌష్టిక విలువలను ప్రామాణికంగా తీసుకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరు దారిద్ర్య రేఖలను సూచించింది. గ్రామాల్లో రోజుకు 2,400 కేలరీలు పట్టణ ప్రాంతాల్లో 2,100 కంటే తక్కువ కేలరీలను దారిద్ర్యరేఖగా ప్రతిపాదించింది.
9. ప్రపంచ బ్యాంకు 1989లో ఇండియా పావర్టీ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ సర్వీస్ అనే అధ్యయనంలో కనీస కేలరీల ప్రమాణాన్ని తీసుకొని దారిద్ర్యరేఖను నిర్ణయించింది.
10. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 8వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రూ.11,000 వార్షికాదాయానికంటే తక్కువ ఆదాయం గల కుటుంబాలు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నట్లుగా నిర్ధారించింది. 1999 -2000లో దేశంలో పేదరికం 26.1 శాతంగానూ, 2004-05 నాటికి పేదరికం 27.5 శాతంగానూ అంచనా కట్టింది.
11. 2007 ముఖ్యమంత్రుల సదస్సు
దారిద్ర్యరేఖను నిర్వచించేందుకు ఏడు కనీస ప్రాథమిక సేవలను ముఖ్యమంత్రుల సదస్సు ప్రామాణికంగా సూచించింది. అవి: 1. పౌష్టికాహారం 2. విద్య, 3. ఆరోగ్యం, 4. సురక్షిత మంచినీరు, 5. కనీస గృహవసతి, 6. డ్రైనేజీ సౌకర్యాలు, 7. రోడ్డు రవాణా సౌకర్యాలు
12. ప్రణాళికా సంఘం దారిద్ర్యరేఖకు నెలవారీ వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటోంది.
పేదరికంపై ప్రణాళిక సంఘం తాజా అంచనాలు:
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్యం శరవేగంగా కనుమరుగవుతోందని ప్రణాళిక సంఘం ప్రకటించింది. పేదరికంపై సురేశ్ టెండూల్కర్ కమిటీ సూచించిన పద్ధతిని పాటించి దేశంలో 2011 -12 నాటికి 21.9 శాతం ప్రజలు మాత్రమే దారిద్ర్యంలో మగ్గుతున్నారని తేల్చి చెప్పింది. జాతీయ నమూనా సర్వే దేశవ్యాప్తంగా నిర్వహించిన 68వ రౌండ్ సర్వే (2011-12) ఫలితాలు 2013 జూన్ నెలలో వెల్లడైన నేపథ్యంలో ప్రణాళిక సంఘం తాజాగా దారిద్ర్య అంచనాలను రాష్ట్రాల వారీగా దారిద్ర్యరేఖల వివరాలను సవరించింది. ప్రణాళిక సంఘం వెల్లడించిన లెక్కలు ఆశ్చర్యకరంగా ఉండటంతో 2004 -05లో పేదలు 40.71 కోట్లు ఉండగా 2011 -12 నాటికి 26.93 కోట్లకు తగ్గిపోయారని పేర్కొనడంలో వాస్తవమెంత అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
పేదరికం తగ్గుదలపై విమర్శలు:
భారతదేశంలో పేదలు ఒక్కసారిగా 21.9 శాతానికి పడిపోవడం (ప్రణాళిక సంఘం అంచనా)పై సామాజిక వేత్తలు, ఆర్థిక నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికా సంఘం పేదరిక గణాంకాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2004-05 నాటికి దేశంలో పేదలు 37.2 శాతం ఉంటే 2009-10 నాటికి 29.8 శాతానికి చేరుకోవడం 2011 -12 నాటికి మరింత వేగంగా తగ్గి 21.9 శాతానికి చేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఓ వైపు పేదలు తగ్గిపోయారని చెబుతూనే మరో వైపు ఆహార భద్రత చట్టం ద్వారా దేశంలో 67 శాతం మందికి సబ్సిడీ ఆహారాన్ని అందించాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. 2015 నాటికి దేశంలో పేదరికం 22 శాతానికి తగ్గుతుందని ప్రణాళిక సంఘం తెలిపింది. 2017 నాటికి చైనా, భారత్ లలో సుమారు 32 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడతారని ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల నివేదిక (UN Millennium development Goals) లో తెలిపింది. వాస్తవానికి ప్రపంచంలోని మొత్తం పేదల్లో మూడో వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అదే విధంగా దేశంలో 41.6 శాతం మంది ప్రజల సగటు దినసరి ఆదాయం పట్టణాల్లో రూ.21.6 అని గ్రామీణ ప్రాంతాల్లో రూ.14.3 అని అంచనా వేసింది. దేశంలో అత్యధికంగా ఉన్న పేదరికాన్ని మందింపు చేయడానికి ఒక నిర్దిష్టమైన విధానమేదీ లేదు. 37 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారని టెండూల్కర్ కమిటీ పేర్కొంది. ఈ నివేదికను ప్రణాళిక సంఘం ఆమోదించింది.
అర్జున్ సేన్ గుప్తా నివేదిక ప్రకారం దేశంలో 77 శాతం మంది రోజుకు రూ.20 కంటే తక్కువ ఆదాయంతో జీవితం గడుపుతున్నారు. సుమారు 50 శాతం మంది భారతీయులు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని ఎన్.సి. సక్సేనా నివేదిక వెల్లడిస్తోంది. “ఆక్స్ ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ సొసైటీ” భారతదేశంలోని పేదరికంపై బహుళకోణ పేదరిక సూచీ సహాయంతో అధ్యయనం జరిపి 64.50 కోట్ల మంది భారతీయులు పేదలేనని వీరిలో 42 కోట్ల మంది 8 ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల్లో ఉన్నారని వెల్లడించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు 9 శాతానికి పెరిగినప్పటికీ దేశంలో పేదరికం విస్తరించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థే అయినప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
భారతదేశం గత 66 ఏళ్లుగా పేదరికంపై పోరాటం సాగిస్తోంది. 1950లలో చేపట్టిన పేదరిక నిర్మూలన పథకాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలివ్వలేదు. పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలన్నా, అగ్రరాజ్యంగా గుర్తింపు పొందాలన్నా భారత్ పేదరిక సమస్యను వేగంగా పరిష్కరించాల్సి ఉంటుంది. 70వ దశకం నుంచి 90వ దశకం వరకు పేదరిక నిర్మూలన పథకాల వల్ల పేదరికం 60 శాతం తగ్గిపోయింది. కానీ ప్రపంచీకరణ, సరళీకరణల నేపథ్యంలో పేదరికం తిరిగి పెరిగిందని ఆర్థిక వేత్తల అభిప్రాయం. దేశంలో దారిద్ర్యరేఖ ద్వారా పేదరికాన్ని అంచనా వేయడం మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. నివాసం, పౌష్టికాహారం, దుస్తులు, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, కనీస వేతనాలు తదితర సౌకర్యాలకు నోచుకోని వారిని పేదలుగా పరిగణించడం జరిగింది. కాగా ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితులను అద్దం పట్టడం లేదని ఈ లెక్కలన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హులను కుదించి ఆ వ్యయాన్ని తగ్గించుకోవడానికేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నిర్వచనం- అశాస్త్రీయత:
సమస్యను పరిష్కరించడానికి ముందుగా సమస్య నిర్వచనం, అంచనాల్లో స్పష్టత ఉండాలి. అప్పుడే సమస్య పరిష్కారం కోసం పటిష్టమైన కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం సాధ్యమవుతుంది. పేదరికం నిర్వచనం విషయంలో ఈ స్పష్టతే లోపించింది. పేదరిక అంచనాలకు భారత ప్రభుత్వం మొదటి నుంచి శాస్త్రీయ విధానాలను అవలంబించకపోవడం, పేదరిక అంచనాలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీలు ఇచ్చిన గణాంకాల మధ్య పొంతన లేకపోవడం, ప్రణాళిక సంఘం, నేషనల్ శాంపిల్ సర్వే అంచనాల మధ్య కూడా సారూప్యత లేకపోవడాన్ని బట్టి దేశంలో పేదరికం అంచనా ఎంత ఖచ్చితంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ కూలీల వినియోగదారుల సూచిక ఆధారంగా గ్రామీణ పేదరికాన్ని, పట్టణ పారిశ్రామిక వినియోగదారుల సూచికను పరిగణనలోకి తీసుకొని పట్టణ పేదరికాన్ని అంచనా కట్టిన లక్డవాలా కమిటీ నెలవారీ తలసరి కనిష్ట వ్యయం పట్టణాల్లో రూ.57, గ్రామాల్లో రూ.49గా నిర్ధారించింది. ప్రణాళిక సంఘం 2004-05 నుండి నేషనల్ శాంపిల్ సర్వే ఆధారంగా కుటుంబ వినియోగ ధరల దస్త్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని దారిద్ర్యరేఖను నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం 30 రోజులకు ఒక వ్యక్తి మనుగడకు అవసరమయిన అన్ని రకాల కనీస వస్తువులకయ్యే కనిష్ట జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకునే Uniform Recall Period (URP) పద్ధతి, ఒక వ్యక్తి 365 రోజులకు తరచూ వినియోగించే వస్త్రాలు, పాదరక్షలు, మన్నికగల వస్తువులు, విద్య, వైద్యాలకు జరిగే వ్యయాన్ని ఆధారంగా చేసుకునే Mixed Recall పద్ధతి ద్వారా దారిద్ర్యరేఖను నిర్ణయించడం జరిగింది. సురేశ్ టెండూల్కర్ కమిటీ (2005-09) జాతీయ స్థాయిలో రాష్ట్రాల వారీగా ధరల సూచీలను ప్రామాణికంగా తీసుకుంది. ఆవాసం, విద్య, ఆరోగ్యం, ఇంటి అద్దె, ప్రయాణ ఖర్చు వంటి అంశాలను వ్యక్తిగత వినియోగ జాబితాలోకి చేర్చి పేదరికం అంచనాలకు ప్రాతిపదికలను తీసుకుంది. ఈ కమిటీ దేశంలో పేదరికం 37.2 శాతం ఉందని, ఇందులో గ్రామీణ పేదరికం 41.8 శాతం అని పట్టణ పేదరికం 21.7 శాతం అని పేర్కొంది. ప్రపంచబ్యాంకు వ్యక్తి కనీస తలసరి రోజు వ్యయం ఒక డాలర్ గా పరిగణనలోకి తీసుకొని 2004-05 నాటికి దేశంలో పేదలు 34.7 శాతం వరకు ఉన్నారని వెల్లడించింది. కేంద్రం నియమించిన సక్సేనా కమిటీ దేశంలో పేదరికం 50 శాతం అని పేర్కొంది. అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఏకంగా 77 శాతం అని పేర్కొంది. ఫలితంగా దేశంలో పేదలు ఎంత మంది అన్న సందేహం సందిగ్ధత నాటి నుంచి నేటి తాజా లెక్కల వరకు కొనసాగుతూనే ఉంది.
సురేశ్ టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రాతిపదికన ప్రణాళిక సంఘం భారతీయ సగటు పౌరుడు బతకడానికి రోజువారీ ఖర్చు సగటున గ్రామీణ ప్రాంతంలో రూ.27, పట్టణ ప్రాంతాల్లో రూ.33 గా నిర్ణయించడం నేడున్న మార్కెట్ వ్యవస్థలోని జీవన వ్యయానికి ఎంత దూరంగా ఉందో తెలుస్తుంది. పేదలను గుర్తించడానికి శాస్త్రీయ పద్ధతిలేని పరిస్థితుల్లో సగటు పౌరుని వ్యయాన్ని ఏ ప్రాతిపదికన అంచనా వేశారన్న సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాల పనితీరును ప్రజలకు చెప్పడానికి పేదరిక గణాంకాలను ఎంచుకోవడం సరైన విధానం కాకపోవచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాల్లో పేదలు, నిరుపేదల సంఖ్యను ప్రభుత్వానికి భారంగా భావిస్తున్న అధికార గణం పేదరికం అంచనా విషయంలో పేదలు అతి తక్కువగా ఉన్నట్లు పేర్కొనడం పరస్పర విరుద్ధంగా కనబడుతోంది. ఆక్స్ ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ సొసైటీ భారతదేశంలోని పేదరికంపై బహుళకోణ పేదరిక సూచి సహాయంతో అధ్యయనం చేసి 64.50 కోట్ల మంది పేదలున్నట్లు గుర్తించింది. ఇందులో ఎనిమిది కోట్లు ఉత్తర, తూర్పు భారతీయ రాష్ట్రాలలోనే ఉన్నారని, నిజానికి 26 నిరుపేద ఆఫ్రికా దేశాల్లో కూడా పేదల సంఖ్య 41 కోట్ల లోపే ఉండటాన్ని బట్టి భారతదేశంలో పేదరికం తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సురేశ్ టెండూల్కర్ నివేదికను అనుసరించి తలసరి ఆదాయం వినియోగంలో పెరుగుదల ఆధారంగా 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.816, పట్టణాల్లో రూ.1000 ఉన్నట్లు అంచనా. ఫలితంగా వస్తుసేవల వినియోగానికి పట్టణాల్లో రోజుకు రూ.33.33, గ్రామాల్లో రూ.27.20 ఖర్చవుతుంది. దీన్ని బట్టి ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లోనైతే నెలకు రూ.4080, పట్టణప్రాంతాల్లోనైతే రూ.5000 గా వినియోగ వ్యయం ఉన్నట్లు ప్రణాళికా సంఘం పేర్కొనడంలో ఏ మేరకు శాస్త్రీయత ఉందన్న విమర్శ తలెత్తుతోంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కనీస జీవనోపాధిని చట్టబద్ధంగా కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సగటున రోజు కూలీ రూ.120 వరకు ఉంది. అయితే దీని ద్వారా లబ్ధిపొందుతున్నవారు దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నట్లా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఈ ఉపాధి చట్టపరంగా సంవత్సరంలో వంద రోజులు అని పేర్కొన్నప్పటికీ సగటు 65 రోజులకు మించి ఉపాధి లేదు మరి మిగతా మూడు వందల రోజులు ఎలాంటి ఆదాయం లేకుండా గడిపే ఉపాధి హామీ లబ్ధిదారులు పేదలు కారా అంటే సరైన సమాధానం లభించదు.
వాస్తవ కొలమానాలే ప్రామాణికం:
కేవలం ఆర్థిక కోణంలో మాత్రమే చూస్తే పేదరికం నిజ స్వరూపం స్పష్టం కాదు. ఆహార కేలరీల పరంగా తలసరి వ్యయం, తలసరి వినియోగం ఖర్చు నిర్ధారించి లక్దావాలా కమిటీ దారిద్ర్యరేఖను నిర్ధారించింది. ఈ పద్ధతిని అనుసరించి రోజుకి ఒక్కొక్కరికి గ్రామాల్లో 2,400 కేలరీలు, పట్టణాల్లో 2,100 కేలరీలు శక్తినిచ్చే ఆహారం కొనడానికి అవసరమయ్యే డబ్బుతో వాస్తవంలో నెలకు తలసరి ఖర్చును నిర్ధారించి దారిద్ర్యరేఖను నిర్ణయించారు. దారిద్ర్యరేఖ నిర్ధారణకు సగటున 1800 కేలరీలను ప్రామాణికంగా గ్రహించిన అంతర్జాతీయ ఆహార సంస్థ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని సురేశ్ టెండూల్కర్ కమిటీ కేలరీలను కుదించింది. ఈ లెక్కన 1776 కేలరీలను పొందడానికి దినసరి తలసరి సగటు ఖర్చు గ్రామీణులకు రూ.14గా పట్టణ ప్రజలకు రూ.19 గా నిర్ణయించారు. తదుపరి దినసరి తలసరి సగటు ఖర్చు గ్రామీణ ప్రాంతంలో రూ.27, పట్టణ ప్రాంతంలో రూ.33 గా సవరించారు.
శారీరక శ్రమలేని వారిని ఉద్దేశించి మాత్రమే అంతర్జాతీయ ఆహార సంస్థ 1800 కేలరీలు ప్రామాణికంగా తీసుకుందని గమనించాలి. దేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 44 శాతం మంది పోషకాహార లోపంతో, 56 శాతం మంది స్త్రీలు, 25 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అంటే కేవలం సగటు తలసరి వినియోగం ఖర్చు ప్రాతిపదికన మాత్రమే పేదరిక తీవ్రతను వాస్తవంగా అంచనాకట్టలేమని అర్థమవుతుంది.
ఆహారలభ్యత, ఆకలి, ఆరోగ్యం, పరిశుభ్రమైన తాగునీరు, విద్య, నివాసం, పారిశుద్ధ్యం, కనీస వసతులు వంటి అనేక అంశాలు పేదరికం నిర్ధారణకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేలరీల ప్రాతిపదికన కనీస ఆహారాన్ని పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని నిర్ణయించడం పేదరికాన్ని కుదించి చూపించే ప్రయత్నమే అవుతుంది తప్ప వాస్తవికంగా పేదరికం నిర్ధారణకు ఇది సరైన కొలమానం కాలేదు. ఆహార కేటగిరీలతో పాటు మిగతా సామాజిక, ఆర్థిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోగలిగితేనే శాస్త్రీయంగా పేదరికాన్ని అంచనావేయడం సాధ్యమవుతుంది. దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతున్నప్పటికీ కనీస వేతనాలు, విద్యా, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ మొదలైన సామాజిక సూచికల్లో ప్రగతి అధ్వాన్నంగా ఉంది. విద్యా, ఆరోగ్య సూచీల పరంగా భారతదేశ స్థానం బంగ్లాదేశ్ లాంటి వెనుకబడిన దేశాల కంటే దిగువన ఉండటం శోచనీయం. ప్రజారోగ్యంపై భారతదేశం జీడీపీలో ఒక్క శాతం మాత్రమే ఖర్చు చేస్తుంటే చైనా, బ్రెజిల్ వంటి దేశాలు జీడీపీలో 3 శాతం పైగా ఖర్చు చేస్తున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశమూ పేదరిక నిర్మూలనకు సుదీర్ఘకాలం పోరాడిన దాఖలాలు లేవు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా మూడు, నాలుగు దశాబ్దాలలోనే పేదరిక సమస్య తీవ్రతను చాలావరకు తగ్గించుకోగలిగాయి. ఆయా దేశాలు పేదరికాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం వల్లే సత్ఫలితాలు పొందాయని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
భారతదేశంలో దారిద్ర్యరేఖను అంచనా వేయడం, పేదరికం నిర్ధారణ మొదటి నుంచి వివాదాస్పదమవుతున్నాయి. నివాసం, పౌష్టికాహారం, వస్త్రాలు, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, కనీస వేతనాలు తదితర సౌకర్యాలు అందుబాటులో లేనివారిని పేదలుగా పరిగణించడం జరుగుతోంది. అయితే అనేక వర్గాలను పేదల జాబితాలో చేర్చకపోవడం దారిద్ర్యరేఖ అంచనాలపై విమర్శలకు కారణమవుతోంది. 1970 నుంచి 1990 వరకు పేదరిక నిర్మూలన పథకాలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ సమయంలో దారిద్ర్యం 60 శాతం నుంచి 40 శాతానికి తగ్గింది. 1990 తర్వాత మొదలైన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రభావం వల్ల పేదల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత గల నిరుపేదలు ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణాల ఫలితాలను పొందలేకపోయారు. ఆధునిక యుగంలో మనిషి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేయడమే పేదరిక నిర్మూలనగా భావించాలి.
స్వాతంత్య్రానంతరం ఆరు దశాబ్దాలుగా గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు వందలాది కార్యక్రమాలను ప్రవేశపెట్టినప్పటికీ 67 శాతం మందికి ఆహార భద్రతను అందించేందుకు చట్టాన్ని రూపొందించడం దీనికి నిదర్శనం కావచ్చు. గ్రామీణ వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురికావడం, చేతివృత్తులు నిర్వీర్యం కావడం, కుల వృత్తులు అంతరించిపోవడం వంటి పరిణామాలు స్వావలంబన సమాజాన్ని పరాధీనం చేశాయి. ఫలితంగా పేదరికం తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఐక్యరాజ్యసమితి సూచిస్తున్న ప్రమాణాల ప్రకారం పేదరికంపై పోరాటాన్ని మానవ హక్కుల పరిరక్షణ నుంచి విడదీసి చూడలేము. 1993 నాటి వియన్నా ప్రకటన, 2000 సంవత్సరపు సహస్రాబ్ధి డిక్లరేషన్ 2005 నాటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ నివేదిక పేదరికాన్ని నిర్వచించిన తీరుకు తాజాగా ప్రణాళికా సంఘం వెల్లడించిన గణాంకాలకు ఎలాంటి పోలిక కనపడటం లేదు.
పేదరికం నిర్ధారణే కీలకం:
అమెరికాలో నలుగురు సభ్యుల కుటుంబం రోజుకు 63 డాలర్ల కంటే తక్కువ సంపాదన కలిగి ఉండేవారిని పేదలుగా పరిగణిస్తున్నారు. భారతేతర వర్ధమాన దేశాలు రోజుకు నాలుగు డాలర్లను పేదరికానికి ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. అయితే భారతదేశం మాత్రం కేవలం అర డాలరు సంపాదన కంటే ఎక్కువగా కలిగి ఉన్నవారు పేదలు కాదంటోంది. Global Monitoring Report పేరుతో 2010 లో ప్రపంచ బ్యాంకు వెలువరించిన నివేదిక ప్రకారం 2015 నాటికి భారత్ లో సుమారు 78 కోట్ల మందికి పైగా రోజుకు రెండు డాలర్ల కంటే తక్కువ సంపాదనతో మనుగడ సాగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా భారత్ మాత్రం పేదలు గణనీయంగా తగ్గారని చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. పేదరికాన్ని తుదముట్టించేందుకు వివిధ పంచవర్ష ప్రణాళికల్లో యుద్ధ ప్రాతిపదికన అనేక కార్యక్రమాలను చేపట్టారు. అయితే పేదరికం నిర్ధారణకు మాత్రం సరైన వ్యూహాన్ని అనుసరించలేదు. పేదరికాన్ని ఖచ్చితంగా శాస్త్రీయంగా నిర్ధారించకుండా దాని నివారణకు ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని గ్రహించాలి.
ప్రేమ విఘ్నేశ్వర్ రావు కె.

#Tags