Teaching and Non Teaching : ఎన్‌హెచ్‌ఆర్‌ఐఎంహెచ్‌లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. అర్హులు వీరే..

కొట్టాయం(కేరళ)లోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌)కి చెందిన నేషనల్‌ హోమియోపతి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ మెంటల్‌ హెల్త్‌(ఎన్‌హెచ్‌ఆర్‌ఐఎంహెచ్‌).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 05.
»    పోస్టుల వివరాలు: క్లినికల్‌ సైకాలజిస్ట్‌–01, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌–01, సైకియాట్రిక్‌ సోష­ల్‌ వర్కర్‌–01, థెరపీ అసిస్టెంట్‌(ఆక్యుపేషనల్‌)–01, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు క్లినికల్‌ సైకాలజిస్ట్‌ పోస్టుకు రూ.50,000, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌ పోస్టుకు రూ.40,000, మిగతా పోస్టులకు రూ.30,000
»    వయసు: క్లినికల్‌ సైకాలజిస్ట్‌ పోస్టుకు 62 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీస్‌ ఇన్‌ఛార్జ్, నేషనల్‌ హోమియోపతి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ మెంటల్‌ హెల్త్, సచివోత్తమపురం, కొట్టాయం చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 20.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.ccrhindia.nic.in

 Maori Crown: మావోరి తెగకు కొత్త రాణి.. 27 ఏళ్ల అమ్మాయి.. ఎవ‌రో తెలుసా..?

#Tags