AVNL Posts : ఏవీఎన్‌ఎల్‌లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
థానే(మహారాష్ట్ర) జిల్లాలోని అంబర్‌నాథ్ యూనిట్‌లో ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్‌ఎల్)–మెషిన్ టూల్ ప్రోటైప్ ఫ్యాక్టరీ(ఎంటీపీఎఫ్) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 81.
» పోస్టుల వివరాలు: జూనియర్ మేనేజర్–26, డిప్లొమా టెక్నీషియన్–34, అసిస్టెంట్–02, జూనియర్ టెక్నీషియన్–19.
» విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్–అకౌంట్స్, మార్కెటింగ్–ఎక్స్‌పోర్ట్, ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్,సీఎన్‌సీ ఆపరేటర్,క్వాలిటీ–ఇన్‌స్పెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,స్టోర్/ఎంఎం / ప్రొక్యూర్‌మెంట్, ఎలక్ట్రీషియన్, గ్రైండర్, మిల్‌రైట్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: జూనియర్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.47,610, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.34,227, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.37,201.
» వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్‌నాథ్, థానే జిల్లా, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 11.10.2024.
» వెబ్‌సైట్: https://avnl.co.in