AP NIT : ఏపీ నిట్‌లో ఉద్యోగ జాత‌ర‌.. ఈ పోస్టుల్లో ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలైంది.

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబరు 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యా శాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాకల్టీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. 

Life Sciences: లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ టాప్‌

ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–10కు సంబంధించి 48 పోస్టులను భర్తీ కానున్నాయి. వీటిలో అన్‌ రిజర్వ్‌డ్‌ కోటాలో 20, ఓబీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్‌ కింద 5 కేటాయించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–11కు సంబంధించి భర్తీ చేయనున్న 20 పోస్టుల్లో అన్‌ రిజర్వ్‌డ్‌కు 9, ఓబీసీకి 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కు 2 పోస్టులు కేటాయించారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అసోసియేట్‌ ప్రొఫెసర్‌–13 ఏ2 కేటగిరీకి సంబంధించి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అన్‌ రిజర్వ్‌డ్‌కు 12, ఓబీసీకి 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్‌కు 3 పోస్టులను కేటాయించారు. ప్రొఫెసర్‌ 14ఏ గ్రేడ్‌కు సంబంధించి 7 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అన్‌ రిజర్వుడ్‌కు 4, ఓబీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి పోస్టులను రిజర్వు చేశారు.

KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం..

బయో టెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, సీఎస్‌­ఈ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్, ఎంఎంఈ, స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో కొత్తగా తీసుకొనే ఫ్యాకల్టీలను నియమించనున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here

#Tags