Guest Faculty Posts : ఆంధ్రా యూనివ‌ర్సిటీలో గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల నియామ‌కాలు..

విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో బోధన పటిష్టతకు అవసరమైన గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్‌ కొరత లేకుండా చూస్తామని, ఎక్కడా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఆపిన గెస్ట్‌ ఫ్యాకల్టీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సెమిస్టర్‌కు వారికి ఇచ్చే పారితోషకాన్ని కూడా అన్ని కళాశాలలకు సమానంగా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Job Mela: ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు.. ఈనెల 30న జాబ్‌మేళా

#Tags