Faculty Posts at AIIMS : ఎయిమ్స్‌లో వివిధ భాగాల్లో ఫ్యాక‌ల్టీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

తెలంగాణ రాష్ట్రం బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 68.
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–24, అడిషనల్‌ ప్రొఫెసర్‌–06, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–16, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–22.
»    విభాగాలు: అనెస్తీషియాలజీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, రేడియో–డయాగ్నోసిస్‌ తదితరాలు.
»    అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,68,900, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,48,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,38,300, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,01,500.
»    వయసు: ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 58 ఏళ్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తునును రిక్రూట్‌మెంట్‌ సెల్, ఎయిమ్స్‌ బీబీనగర్, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌(హెచ్‌ఎంఆర్‌), తెలంగాణ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తు ప్రారంభతేది: 20.07.2024.
»    ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.09.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.08.2024
»    వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in

Railway Recruitment Cell : సదరన్‌ రైల్వేలో ట్రేడ్‌ అప్రెంటీస్ పోస్టులు.. వివ‌రాలు ఇలా..!

#Tags