Contract Teaching Posts : రాష్ట్రీయ రక్ష యూనివర్శిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..

గాంధీనగర్‌(గుజరాత్‌)లోని రాష్ట్రీయ రక్ష యూనివర్శిటీ(ఆర్‌ఆర్‌యూ)లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    పోస్టులు: అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(రీసెర్చ్‌), టీచింగ్‌ కమ్‌ రీసెర్చ్‌ ఆఫీసర్, రీసెర్చ్‌ ఆఫీసర్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.2,00,000 నుంచి రూ.2,50,000, టీచింగ్‌ కమ్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.74,000 నుంచి రూ.92,000, రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.55,000 నుంచి రూ.70,000, 
మిగతా పోస్టులకు రూ.90,000 
నుంచి రూ.1,15,000.
NTET 2024 Notification: నేషనల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే
»    ఎంపిక విధానం:
విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా 
ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, హ్యూమన్‌ రిసోర్స్‌ సెక్షన్, రాష్ట్రీయ రక్ష యూనివర్శిటీ, ఏటీ.లవడ్, టీఏ.దిహెగమ్, గాంధీనగర్, గుజరాత్‌ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 09.10.2024.
»    వెబ్‌సైట్‌: https://rru.ac.in/

 Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags