TGT and PGT: టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది నవోదయ విద్యాలయ సమితి. దరఖాస్తుల వివరాలు..

సాక్షి ఎడ్యుకేషన్‌: భోపాల్‌లోని నవోదయ విద్యాలయ సమితి.. ఒప్పంద ప్రాతిపదికన 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేస్తారు. 


»    మొత్తం పోస్టుల సంఖ్య: 500
»    పోస్టుల వివరాలు: టీజీటీ–283, పీజీటీ–217. 
»    ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ): 
సబ్జెక్ట్‌లు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ సైన్స్, ఒరియా, కంప్యూటర్‌ సైన్స్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.
»    పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ): 
సబ్జెక్ట్‌లు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250, టీజీటీలకు రూ.40,625.
»    వయసు: 01.07.2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: విద్యార్హతలు, అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.04.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.04.2024
»    ఇంటర్వ్యూ తేదీలు: 16.05.2024 నుంచి 
»    వెబ్‌సైట్‌: https://navodaya.gov.in

#Tags