TS SET 2024 Notification: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే..!
ఇలాంటి ప్రతిభ, నైపుణ్యాలను అంచనా వేయడానికి నిర్వహించే అర్హత పరీక్ష.. టీఎస్ సెట్ (తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష) ఇందులో సాధించిన స్కోరు ఆధారంగానే లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపడతారు. ప్రస్తుతం 2024 సంవత్సరానికి టీఎస్ సెట్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. టీఎస్ సెట్‌కు దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు తదితర వివరాలు..
మొత్తం 30 సబ్జెక్టులు
జనరల్ స్టడీస్‌తో కలిపి మొత్తం 30 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్ విధానంలో టీఎస్ సెట్‌ను నిర్వహిస్తారు. వీటిలో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సొషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రశ్న పత్రం రెండు భాషల్లో(తెలుగు/ఇంగ్లిష్) ఉంటుంది.
Narendra Modi: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం ఇదే..
సబ్జెక్టులు ఇవే
జనరల్ స్టడీస్, జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
అర్హతలు
- యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం/కాలేజీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్‌ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(నాన్ క్రి మీలేయర్), పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేయాలి. పోస్టుగ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులు/పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు తాము చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ సెట్ జాబితాలో లేకుంటే.. ఏదైనా ఇతర సంబంధిత సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
- వయసు: ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
- పరీక్ష విధానం
- టీఎస్ సెట్ పరీక్ష ఆఫ్‌లైన్ (పెన్ పేపర్) విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు.. పేపర్లు 1, పేపర్ 2 ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. పేపర్–1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్–2లో 100 ప్రశ్నలు–200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.
- పేపర్–1లో.. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌ను అన్ని విభాగాల అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. పేపర్–2 పరీక్ష ఏ విభాగంలో అభ్యర్థి పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచే శారో దానిపై ఉంటుంది.
NEET 2024 Results: ‘నీట్’పై టెన్షన్.. వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?
టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్–1)
- పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌పై ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహాలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ఇది అందరికీ కామన్ పేపర్.
- మొత్తం 50 ప్రశ్నలు–100 మార్కులకు పేపర్–1 పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తాయి. ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు. తెలుగు/ఇంగ్లిష్‌లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ పేపర్‌కు కేటాయించిన సమయం ఒక గంట మాత్రమే.
- పేపర్–1లో టీచింVŠ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ), పీపుల్, డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- ఎలక్టివ్ సబ్జెక్ట్ (పేపర్–2): ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ (ఎలక్టివ్)కు సంబంధించిన పేపర్. ఇందులో ఆబ్జెక్టివ్ తరహ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు చొప్పున కేటాయించారు.
- ప్రిపరేషన్ ఇలా
- ఈ పరీక్షకు సంబంధించి మొదట సిలబస్‌పై సమగ్రమైన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా అందరికీ కామన్‌గా ఉండే పేపర్–1 ఎంతో కీలకమైంది. ఈ పేపర్ సిలబస్ కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తొలుత పేపర్–1పై దృష్టిపెట్టి ప్రిపరేషన్ కొనసాగించాలి.
- పేపర్–2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది అభ్యర్థి పీజీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్. సదరు అకడెమిక్ పుస్తకాల ద్వారా ప్రిపరేషన్ సా«గించి మంచి మార్కులు స్కోరు చేయవచ్చు. ఇందుకోసం యూజీసీ గతంలో నిర్వహించిన నెట్ ప్రశ్నపత్రాలతోపాటు సెట్ గత పేపర్లను ప్రాక్టీస్ చేయొచ్చు.
Diploma Course Admissions: డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు చివరి తేదీ: 02.07.2024
- ఎడిట్ ఆప్షన్: జూలై 28, 29 తేదీల్లో..
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 20.08.2024
- పరీక్ష తేదీలు: 2024 ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో పరీక్ష జరుగుతుంది.
- వెబ్‌సైట్: http://www.telanganaset.org/