Guest Faculty Jobs: గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. కావల్సిన అర్హతలు ఇవే

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను గెస్ట్‌ ఫ్యాకల్టీ ద్వారా అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్టు ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ జిల్లా డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు తెలిపా రు. గురువారం ఆయన జిల్లాలో ఖాళీలగా ఉన్న పో స్టుల వివరాలను, విధివిధానాలను వెల్లడించారు. జిల్లాలో 16 జనరల్‌, ఒకేషనల్‌ సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 28 ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారు.

అర్హతలు ఇవి..
సంబంధిత లాంగ్వేజ్‌, జనరల్‌ సబ్జెక్టులకు పీజీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ఒకేషనల్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌)కు బీఎస్సీ నాలుగేళ్ల నర్సింగ్‌ కోర్సు, ఓఏ సబ్జెక్టుకు డిగ్రీతోపాటు షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్‌ టైప్‌రైటింగ్‌ కలిగి ఉండాలన్నారు.

Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

అలాగే ఈఈటీ, ఈటీ, సీఈటీ ఒకేషనల్‌ సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఏఅండ్‌టీ సబ్జెక్టుకు ఎంకామ్‌ టాక్సేషన్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. అర్హులై న అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు సర్టిఫికెట్లు జిరాక్స్‌ కాపీలను సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా అందజేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

Job Mela: రేపు జాబ్‌మేళా..నెలకు రూ. 18వేలకు పైగా

ఆసక్తి, అర్హత కలిగిన ఔత్సాహిక అభ్యర్థులు సద్వినియో గం చేసుకోవాలని డీవీఈఓ తవిటినాయుడు సూ చించారు. అలాగే విశ్రాంత లెక్చరర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, వీరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
 

#Tags