GATE 2024 Admit Cards Released- గేట్‌ పరీక్ష రాసేవాళ్లు.. ఇవి గుర్తుంచుకోండి

దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE) 2024 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గేట్- 2024ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు (IISc-Bangalore) నిర్వహించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎగ్జామ్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది.

ముఖ్యమైన తేదీలు

దీని ప్రకారం.. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఒక పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు సెకండ్‌ పేపర్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే gate2024.iisc.ac.inలో హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కశ్చితంగా వెంట తీసుకెళ్లాల్సినవి

అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులో  అభ్యర్థి పేరు, అడ్రస్‌, ఎగ్జామ్‌ సెంటర్‌, ఎగ్జామ్‌ డేట్‌, సమయం, మీ ఫోటో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ముందే చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు వెళ్లేముందు అడ్మిట్‌ కార్డుతో పాటు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదాభారత ప్రభుత్వం విడుదల చేసిన ఏదైనా ఐడీని వెంట తీసుకెళ్లాలి. 
 

#Tags