TS CPGET 2022: తొలివిడత ప్రవేశాలు పూర్తి

ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌ సీపీజీఈటీ–2022 మొదటి కౌన్సెలింగ్‌లో 12,600 మంది అభ్యర్థులు ఆయా వర్సిటీలలోని కాలేజీల్లో ప్రవేశం పొందినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.
తొలివిడత ప్రవేశాలు పూర్తి

సీటు సాధించిన అభ్యర్థుల తొలివిడత రిపోర్టింగ్‌ గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐసీ, ఐదేళ్ల పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సుల్లో మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన 21,329 మంది అభ్యర్థుల్లో 12,600 మంది పోరి్టంగ్‌ చేయగా 8 వేల సీట్లు మిగిలినట్లు వివరించారు.

చదవండి: భారీగా పెరిగిన పీజీ సీట్లు

ఓయూ, కేయూ, జేఎన్‌టీయూ, మహాత్మగాందీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలతో పాటు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాల, అనుబంధ, ప్రయివేటు పీజీ కాలేజీల్లో ప్రవేశం పొందినట్టు తెలిపారు. ఓయూతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ కాలేజీల్లో కేటాయించిన ప్రధాన పీజీ కోర్సుల సీట్లు భర్తీ అయినట్లు పేర్కొన్నారు. త్వరలో రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపారు.

చదవండి: Dual Degree Courses After Inter: డ్యూయల్‌ డిగ్రీతో.. యూజీ + పీజీ!

#Tags