TS CETS 2024 Dates Release: సెట్లు తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌.. షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్‌ ఎంసెట్‌–2024ను మే 9న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను మే 9 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను మే 12 నుంచి 13వరకు నిర్వహించనున్నారు. 2024లో కూడా ఎంసెట్‌ను జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహిస్తోంది. ఎంసెట్‌ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి జ‌న‌వ‌రి 25న‌ తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెట్స్‌కు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఫీజుల వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌లను సంబంధిత సెట్ల కన్వీనర్లు త్వరలో విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. 

College Predictor - 2023 AP EAPCET TS EAPCET

రాష్ట్రంలో నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ..

సెట్

నిర్వహించే యూనివర్సిటీ

పరీక్ష తేదీ

ఈఏపీసెట్‌‌ (ఇంజనీరింగ్‌)

జేఎన్‌టీయూహెచ్‌

9-5-23 – 11-5-24

ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్, ఫార్మసీ)

జేఎన్‌టీయూహెచ్‌

12-5-23 – 13-5-24

టీఎస్ఎడ్యుకేషన్సెట్

మహాత్మాగాంధీ

23-5-24

టీఎస్ఈసెట్

ఉస్మానియా

6-5-24

టీఎస్లాసెట్

ఉస్మానియా

3-6-24

టీఎస్‌ పీఈ సెట్‌

శాతవాహన విశ్వవిద్యాలయం

10, 13-6-24

టీఎస్ఐసెట్

కాకతీయ

4, 5-6-24

టీఎస్‌ పీజీఈసెట్‌

జేఎన్‌టీయూహెచ్‌

6, 8-6-24

#Tags