TS CPGET 2024: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష.. పరీక్షలు నిర్వ‌హ‌ణ‌ ఇలా

కేయూ క్యాంపస్‌ : 2024–2025 విద్యాసంవత్సరా నికి సంబంధించి రాష్ట్రంలోని 8 విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, తదితర పీజీ కోర్సుల్లో 45 సబ్జెక్టుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ స్టేట్‌ కామన్‌ పో స్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (టీజీ–సీపీగెట్‌) జూలై 6వ నుంచి 15 వతేదీ వరకు నిర్వహించబో తున్నారు.

ఈప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించబోతోంది. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్ట్‌డ్‌ పద్ధతిలోనే ఈ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీ సీపీగెట్‌ కన్వీనర్‌, ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి జూలై 4న‌ తెలిపారు. మోక్షిత కంప్యూటర్‌ సెంటర్‌, చైతన్య డీమ్డ్‌ యూ నివర్సిటీ, నోబుల్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, ఎర్రగట్టుగుట్టలోని ఆయాన్‌ డిజిటల్‌, జయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్సెస్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ నెల 6 నుంచి 15వరకు ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్నింటిలో కలిపి మొత్తం 7,500 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు. రోజూ మూడు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఒక్కోసెషన్‌లో ఏఏ సబ్జెక్టుల పరీక్షలు ఉంటాయని టైంటేబుల్‌లో వివరాలున్నాయి. ఆయా పరీక్షల తేదీల్లో మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 11గంటల వరకు విద్యార్థులను గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

చదవండి: TS CPGET 2024: పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు.. ఈ కారణంగా జూలై 7న జరిగే పరీక్ష వాయిదా

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని కన్వీనర్‌ పాండురంగారెడ్డి తెలిపారు. 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒంటిగంటకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరుగంటల వరకు పరీక్ష ఉంటుంది.

4.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు బయోమెట్రిక్‌ పద్ధతిలో అటెండెన్స్‌ కూడా తీసుకుంటారు అందుకే గంటన్నర ముందుగానే చేరుకోవాల్సింటుందని కన్వీనర్‌ తెలిపారు. ప్రతి సబ్జెక్టు ప్రవేశ పరీక్షకు 100 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.

చదవండి: TS CPGET 2024: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఎంఏ కోర్సులో ప్రవేశాలు

ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే ఉంటుంది. విద్యా ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, హాల్‌టికెట్‌తోపాటు ఐడీ ప్రూఫ్‌ ఆధార్‌ లేదా ఇతర ఏదైనా ఐడీప్రూఫ్‌ను పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా తీసుకు రావాలని పాండురంగారెడ్డి తెలిపారు.

#Tags