Silver CET 2024: సిల్వర్ సెట్ పరీక్షకు గడువు పొడగింపు.. చివరి తేదీ ఇదే!
కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు కలిగిన సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రవేశాలకు నిర్వహించే సిల్వర్‌సెట్ గడువు పొడిగించినట్లు క్లస్టర్ యూనివర్సిటీ వీసీ డీవీఆర్ సాయిగోపాల్ తెలిపారు. సోమవారం స్థానిక క్లస్టర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లు, సైంటిస్టులతో పాటు, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించారన్నారు. అలాంటి చరిత్ర కలిగిన కాలేజీలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న సిల్వర్ సెట్–2024 గడువు ఈ నెల 23వ తేది వరకు పొడిగించామన్నారు.
NEET 2024: నీట్ 2024 పరీక్షపై విచారణ జరపాల్సిందే.. లేకుంటే..!
వచ్చే నెల 7న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. కాలేజీలో అత్యుత్తమ బోధనతో పాటు బాలురు, బాలికలకు వేరువేరుగా హాస్టల్ సదుపాయం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, సిల్వర్ సెట్ కన్వీనర్ ఆచార్య శ్రీనివాసులు, ప్రిన్సిపల్ డాక్టర్ వీవీఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి, అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ వాయిజ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్‌కుమార్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ దలవాయి శ్రీనివాసులు, డాక్టర్ ఎల్లా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే