AP PGCET Counselling 2024: ప్రారంభమైన పీజీ సెట్‌–2024 ఆప్షన్ల ప్రక్రియ

తిరుపతి: వర్సిటీలలో పీజీ కోర్సులలో ప్రవేశం నిమిత్తం నిర్వహించిన ఏపీ పీజీ సెట్‌–2024 కౌన్సెలింగ్‌ సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడత సీట్ల కేటాయింపులో భాగంగా బుధవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి అవకాశం ఇచ్చింది.

AP Schools: ఈనెల 27 నుంచి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ ఇదే

దీంతో ఎస్వీయూ, పద్మావతి వర్సిటీలలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్‌ కోర్సులలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. 24న ఆప్షన్ల మార్పులకు వెసులుబాటు ఉంటుంది. అలాగే 28న సీట్ల కేటాయింపు పూర్తి చేసి 29వ తేదీ నుంచి సీట్లు పొందిన విద్యార్థులు ఆయా వర్సిటీలలో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.
Paramedical courses Admissions: పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

పలు పీజీ కోర్సులలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎస్వీయూ, పద్మావతి వర్సిటీలలో అడ్మిషన్ల కోసం డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్ల విభాగంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

#Tags