AP PGCET 2024 Web Options Lastdate: పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు నేడే చివరి రోజు..
తిరుపతి: తిరుపతి జిల్లాలోని వర్సిటీల పరిధిలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పీజీసెట్–2024 వెబ్‌ఆప్షన్లకు బుధవారం వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పీజీసెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela: రేపు జాబ్‌మేళా.. అర్హతలు ఇవే
గతంలో ఈ నెల 23వరకు వెబ్ ఆప్షన్లకు చివరి తేదీగా నిర్ణయించిన అధికారులు విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 28వరకు పొడిగిస్తున్నట్లు తెలియజేశారు.
29వతేదీ ఆప్షన్ల మార్పునకు అవకాశమిస్తూ, 31వతేదీన మొదటి విడత సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా వర్సిటీల్లో వచ్చేనెల 2వతేదీ నుంచి 5వతేదీ లోపు ఒరిజినల్ ధృవపత్రాలతో అడ్మిషన్లు పొందాలని తెలియజేశారు.
#Tags