RGUKT: ఆర్జీయూకేటీ ఉద్యోగులకు శిక్షణ

బాసర: బాసర ఆర్జీయూకేటీ ఉద్యోగులకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో ఉత్తమ పద్ధతులు’ అంశంపై మూడురోజుల శిక్షణను ఆగ‌స్టు 21న‌ ప్రారంభించారు.

ఎంసీహెచ్‌ఆర్డీ, చీఫ్‌ సెక్రటరీ డైరెక్టర్‌ జనరల్‌ శశాంక్‌ గోయల్‌ సహకారంతో వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ చొరవతో పరిపాలన విభాగంలో నిర్వర్తించాల్సిన విధులపై శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాలేజ్‌ ఎట్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన, ప్రొఫెసర్‌ మజూర్‌ హుస్సేన్‌ వక్తలుగా పాల్గొని ప్రసంగించారు.

చదవండి: Disabled Quota in RGUKT: ట్రిపుల్‌ ఐటీలో వికలాంగుల కోటా కింద సీట్ల భర్తీ

పాలన నాయకత్వం, యూనివర్సిటీ పాలనాపరమైన అంశాలను తుదిరూపు ఇవ్వడం, సమర్థవంతమైన బోర్డు నిర్వహణ కమ్యూనికేషన్‌, వ్యూహాత్మక ప్రణాళిక అమలు విధానాల గురించి వివరించారు.

బడ్జెట్‌, ఆర్థిక ప్రణాళిక, వనరుల కేటాయింపు ఆప్టిమైజేషన్‌, ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ సమ్మతి తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు హరికృష్ణ, రాజు, శ్రీనివాస్‌ మిట్టపల్లి, ఇమామ్‌, చిన్నారెడ్డి, దస్తగిరి సతీశ్‌ రాయల తదితరులు పాల్గొన్నారు.

#Tags