QS Rankings 2025 for BTech : క్యూఎస్-2025 ప్రకారం భారత్ అమెరికాలో సీఎస్ఈకి బెస్ట్ ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: మన దేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. ఎంతోమంది విద్యార్థులు ఈ ఉద్యోగం సాధించి, ఉన్నత జీతం పొంది స్థిరపడేందుకు కలలు కంటుంటారు. అయితే, ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్‌లో టాప్‌లో ఉన్న సంస్థ సాఫ్ట్‌వేర్. ఇక, ఇలాంటి ఉద్యోగాలు పొందాలంటే చదవాల్సిన కోర్సు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ). విద్యార్థులు ఇలాంటి కోర్సులు చేసేందుకు బెస్ట్ కాలేజీని వెతుకుతుంటారు.
ఉత్తమ కళాశాలలో సీటు లభిస్తే ఉద్యోగం, జీవితం, జీతం ఉన్నతంగా, స్థిరంగా ఉంటుందని ఆశిస్తారు. అయితే, విద్యార్థులు చేరేందుకు ప్రస్తుతం, ఉన్న కళాశాలల్లో కల్లా ఉన్న ఉత్తమ, ఉన్నత ఉద్యోగావకాశాలు ఉన్న కళాశాలలను ఒకసారి పరిశీలిద్దాం..
క్యూఎస్ 2025 (క్వాక్వారెల్లి సైమండ్స్) ర్యాంకింగ్స్ ప్రకారం ఉన్న భారత్, అమెరికాలోని బెస్ట్ కాలేజీలు ఇవే..
కాలేజీలు | ర్యాంకులు |
ఐఐటీ దిల్లీ | 64వ ర్యాంక్ |
ఐఐటీ బాంబే | 76వ ర్యాంక్ |
ఐఐటీ మద్రాస్ | 107వ ర్యాంక్ |
ఐఐఎస్సీ | 110వ ర్యాంక్ |
ఐఐటీ కాన్పూర్ | 110వ ర్యాంక్ |
ఐఐటీ ఖరగ్‌పూర్ | 110వ ర్యాంక్ |
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | 110వ ర్యాంక్ |
ఐఐటీ రూర్కీ | 201-250 ర్యాంక్‌ల మధ్యలో ఉంది |
అన్నా యూనివర్సిటీ | 251-300 |
ఐఐటీ గువాహటీ | 251-300 |
యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ | 251-300 |
బిట్స్ పిలానీ | 301-350 |
ఛండీగఢ్ యూనివర్సిటీ | 351-400 |
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ | 401-450 |
హార్వర్డ్ యూనివర్సిటీ | 1వ ర్యాంక్ |
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) | 2వ ర్యాంక్ |
స్టాన్‌ఫర్డ్ వర్సిటీ | 4 |
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లే | 6 |
ప్రిన్స్టన్ యూనివర్సిటీ | 7 |
యేలే యూనివర్సిటీ | 9 |
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) | 13 |
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (లాస్ఏంజెల్స్) | 15 |
యూనివర్సిటీ ఆఫ్ చికాగో | 16 |
కొలంబియా యూనివర్సిటీ | 17 |
యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ | 18 |
కార్నెల్ యూనివర్సిటీ | 20 |
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా | 22 |
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ |
23 26 |
భారత్‌లోని కళాశాలల్లో ఎందరో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తగిన ఉద్యోగాల్లో స్థిరపడతారు. కానీ, అనేక మంది విదేశాల్లో చదివేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే, ఇలాంటి ఉద్యోగాలకు మరింత ఖచ్చితంగా ఇతర దేశాల్లో.. అంటే ఎక్కువ శాతం అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగాలు పొంది స్థిరపడాలని ప్రయత్నిస్తుంటారు. అటువంటివారికి ఈ టాప్ వర్సిటీలను సూచించింది క్యూఎస్ 2025 ర్యాంకింగ్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)