OU: గ్రేస్‌ మార్కుల పెంపు కోసం సీఎంకు వినతి

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2016, 2017 బ్యాచ్‌ పూర్వవిద్యార్థులు గ్రేస్‌ మార్కుల పెంపు కోసం సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందచేశారు.

డిసెంబ‌ర్ 22న‌ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో షేక్‌ అహ్మద్‌ నేతృత్వంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి.. ఇంజినీరింగ్‌ ఓయూలో చివరి సంవత్సరం విద్యార్థులకు అమలవుతున్న 0.5 గ్రేస్‌ మార్కుల శాతాన్ని 1కి పెంచాలని కోరారు.

చదవండి: Preparation Tips For JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. సమన్వయంతోనే సక్సెస్‌!

పాయింట్‌ ఫైవ్‌ విధానం వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఒక శాతానికి గ్రేస్‌ మార్కులు పెంచితేనే ఎక్కువ మంది ఉత్తీర్ణులవుతారని వివరించారు. విద్యార్థుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఓయూ వైస్‌ ఛాన్స్‌లర్‌తో మాట్లాడి అమలు చేసేల చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.

#Tags