BITS Pilani launches new PG Courses: బిట్స్ పిలానీలో సరికొత్త పీజీ కోర్సులు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్‌కు సంబంధించి మూడు సరి కొత్త పీజీ డిప్లొమా కోర్సులను అందుబాటుకి తీసుకొచ్చినట్లు బిట్స్ పిలానీ ప్రకటించింది.
వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కింద స్మార్ట్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆటోమోటివ్ డొమైన్లలో పనిచేసే ఇంజినీర్లకు మరింత నైపుణ్యత కోసం పీజీ డిప్లొమా కోర్సులు ఎంతో దోహద పడతాయని పేర్కొంది.
చదవండి: Work Integrated Learning Programmes: బిట్స్ పిలానిలో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్
కెరీర్ కు ఎలాంటి విరామం లేకుండా కొనసాగించగల ఈ ప్రోగ్రామ్లను ప్రధాన ఆటోమోటివ్ కంపెనీల సహకారంతో రూపొందిం చి, అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం మార్చి 18 వరకు దరఖాస్తులు చేసుకొవచ్చని విజ్ఞప్తి చేసింది.
#Tags