Engineering Students: కంప్యూటర్స్‌ విద్యతో ఉద్యోగావకాశాలు

ఒంగోలు: భవిష్యత్తులో కంప్యూటర్‌ విద్యార్థులకు ఎక్కువుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎక్సెల్‌ సొల్యూషన్‌ సీఈవో డాక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు.

స్థానిక అంజయ్య రోడ్డులోని బ్రిలియంట్‌ కంప్యూటర్స్‌ సంస్థలో త్వరలో ఇంజినీరింగ్‌లో చేరబోయే విద్యార్థులకు నిర్వహించిన ఫ్రీ ఏఎస్‌కే వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్‌ వినియోగం నేడు అన్ని రంగాల్లో పెరిగిందని, దీనివల్ల కంప్యూటర్‌ సేవలు తప్పనిసరి అవుతాయన్నారు. విద్యార్థులు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరిన మొదటి సంవత్సరం నుంచి నూతన ప్రోగ్రామింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులు అభ్యసించాలని, అప్పుడే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో జాబ్‌ సాధించగలుగుతామన్నారు.

చదవండి: Free Training Program: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ఐటీలో ఉచితంగా శిక్షణ

సీనియర్‌ డేటా అనలిస్ట్‌ బాలకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ బాగా నేర్చుకోవాలన్నారు. అవి కష్టం అనుకోకుండా ఇష్టంగా నేర్చుకోగలిగితే పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందవచ్చన్నారు. నేర్చుకునే సమయంలో ఏకాగ్రత కోసం మెడిటేషన్‌ చేయాలన్నారు.

బ్రిలియంట్‌ సంస్థ అధినేత డాక్టర్‌ న్యామతుల్లా బాషా మాట్లాడుతూ.. తమ సంస్థ విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తాహూరా, కోర్సు కోఆర్డినేటర్‌ కోటేశ్వరరావు, మోటివేషన్‌ ట్రైనర్‌ ప్రసాద్‌, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags