Online AI Courses: ఏఐ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కాచిగూడ: కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణకు తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్‌ రెడ్డి తెలిపారు.

ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో సెప్టెంబ‌ర్ 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులతో పాటు వందకు పైగా అంతర్జాతీయ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల నుంచి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.

చదవండి: Online Course on AI: మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ కోసం కృత్రిమ మేధ కోర్సు.. కోర్సు స‌మ‌యం, ఇత‌ర వివ‌రాల కోసం

శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాలలో ఉత్తమ ఉపాధి అవకాశాలున్నట్లు తెలిపారు. వివరాలకు ఫోన్ నంబర్: 95058 00050లో సంప్రదించాలని సూచించారు.

#Tags