Admissions: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాల్లో ఎన్‌సీవీటీ కింద ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మిగిలిన సీట్లకు రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ సత్యనారాయణ జూలై 4న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో అందుబాటులో ఎలక్ట్రీషన్‌, ఫిట్టర్‌, డ్రాప్స్‌ మెన్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానిక్‌ కోర్సులు, డిజిల్‌ మెకానిక్‌, కోప ఏడాది కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆగష్టు 1వ తేదీ నాటికి 14ఏళ్లు నిండిన విద్యార్ధులు జూలై 15వ తేదీలోగా iti.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డు, ఈ మెయిల్‌ ఐడీ, కులం, 1–10తరగతి వరకు బోనోఫైడ్స్‌, ఎస్సెస్సీ మెమో తదితర ఒరిజినల్‌ ధృవపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ నం. 9110523925, 9885249516లో సంప్రదించాలని తెలిపారు.

చదవండి:

TS EAPCET 2024: ఈ కోర్సుల్లో సీట్లు పెంచాల్సిందే.. గత కొన్ని సంవ‌త్స‌రాలుగా క‌న్వీన‌ర్ కోటా సీట్ల భ‌ర్తీ ఇలా..

TS CPGET 2024: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష.. పరీక్షలు నిర్వ‌హ‌ణ‌ ఇలా

#Tags