IIIT-H Launches New Courses: ట్రిపుల్‌ఐటీలో కొత్త కోర్సుకు శ్రీకారం

రాయదుర్గం: హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టారు. ట్రిపుల్‌ ఐటీలోని ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌(ఐహబ్‌) డాటా ద్వారా ఆరు నెలల శిక్షణకు అడ్మిషన్లు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌/ మెషీన్‌ లెర్నింగ్‌పై ఈ కొత్త కోర్సు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చాటిన వారి కోసం ఏఐ/ఎంఎల్‌పై ఆరు మాసాల శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని ఆదివారాల్లో షెడ్యూల్‌ చేయబడిన తరగతులకు, కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల భౌతిక హజరు అవసరం, ఆరు నెలల కోర్సులో ఆధునిక ఏఐ/ఎంఎల్‌ గురించిన సిద్ధాంతం, ట్యూటోరియల్‌లు, ప్రాజెక్టులకు సంబంధించిన కాన్సెప్ట్‌ల వివేకవంతమైన మిశ్రమంగా దీన్ని రూపొందించారు.

కోర్సు కోసం దరఖాస్తు నమోదు చేసుకోవడానికి మే 5 చివరితేదీ అని పేర్కొన్నారు. తరగతులను మే 19 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు కోఆర్డినేటర్‌ ఫాతిమత్‌ రిఫ్నాను 040–66531787 నంబర్‌లో సంప్రదించాలి. కోర్సుపై మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ ihubdata.ai ను సంప్రదించవచ్చు.

చదవండి: AI skills: ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్.. ఎక్క‌డంటే..

ఎంఎల్‌ సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ట్రిపుల్‌ ఐటీ రీసెర్చ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సీవీ జవహర్‌ ఆధునిక మెషిన్‌ లెర్నింగ్‌లో అత్యాధునిక సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, సన్నద్ధం చేయడం మా లక్ష్యాలలో ఒకటని, ఈ క్రమంలోనే ట్రిపుల్‌ఐటీ, ఐహబ్‌ డాటా ఆధ్వర్యంలో ఈ కోర్సుకు శ్రీకారం చుట్టామని ట్రిపుల్‌ ఐటీ రీసెర్చ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సీవీ జవహర్‌ పేర్కొన్నారు. కొత్త కోర్సు ప్రారంభ సందర్భంగా ఆయన ఏప్రిల్‌ 9న‌ మాట్లాడుతూ నగరంలో పెద్ద సంఖ్యలో కార్పొరేట్‌ సంస్ధలు ఈ కార్యక్రమం ద్వారా పరోక్షంగా ప్రయోజనం పొందుతాయన్నారు.

ఐహబ్‌ డేటా ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్స్‌ హెడ్‌ సీకే రాజు మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో నిర్వహించే వారాంతపు శిక్షణ కార్యక్రమం ఇది మూడవ ఎడిషన్‌ అని పేర్కొన్నారు. 

చదవండి: Prime Minister Narendra Modi: డిజిటల్‌ టెక్నాలజీకి పెద్దపీట.. బిల్‌గేట్స్‌తో ‘చాయ్‌ పే చర్చ’

#Tags