‘World Quantum Day’కు ట్రిపుల్ ఐటీ శాస్త్రవేత్తలు
రాయదుర్గం (హైదరాబాద్): అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ప్రపంచ క్వాంటమ్ డే కార్య క్రమంలో పాల్గొనే అవకాశం గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ శాస్త్రవేత్తలకు కలిగింది.
2వ ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి వీరు మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. క్వాంటం టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న పరిశోధనలకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14ను ప్రపంచ క్వాంటం డేగా నిర్ణయించారు. ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లోని క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ అరుణ్ కె పాటికి కూడా ఈ అరుదైన అవకాశం లభించింది.
చదవండి:
#Tags