Engineering: బీటెక్‌, సెమిస్టర్ల పరీక్షల ఫీజు గడువు 22వరకు..

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో బీటెక్‌ (సీఈ, ఎంఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఇసీఈ, ఐటీ అండ్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ నాన్‌ సీబీసీఎస్‌) ఫస్టియర్‌, సెకండియర్‌ మొదటి సెమిస్టర్‌, సెకండియర్‌ రెండో సెమిస్టర్‌, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌, నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌, రెండో సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులకు ఫీజు చెల్లించేందుకు గడువు అపరాధ రుసుము లేకుండా జూలై 22 వరకు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు.

చదవండి: ఇంజనీరింగ్‌ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్

రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 24 వరకు గడువు ఉందని వారు తెలిపారు. అన్ని పేపర్లకు రూ.1,100, బ్యాక్‌లాగ్స్‌ అప్‌ టు రెండు పేపర్ల వరకు రూ.600, ఇంప్రూవ్‌మెంట్‌కు ప్రతీ పేపర్‌కు రూ.300ల చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలని వారు కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ సంబంధిత వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చని తెలిపారు.

#Tags