CENS: బిట్స్‌ పిలానీలో ప్రారంభమైన సీఆర్‌ఈఎన్‌ఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ నేషనల్‌ సెక్యూరిటీ (సీఆర్‌ఈఎన్‌ఎస్‌)ని బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఆవిష్కరించింది.

సీఆర్‌ఈఎన్‌ఎస్‌ చేపట్టే పరిశోధన, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమాలు దేశీయ సాంకేతికత, భద్రత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి.

డీఆర్‌డీఓ, ఇస్రో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌, రక్షణ, పరిశ్రమల సహకారంతో జాతీయ భద్రతా విషయంలో దేశ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఇది దేశ వ్యూహాత్మక, ఆర్థిక వృద్ధికి దోహదపటమే కాకుండా సురక్షితమైన వృద్ధికి సహకారం అందించనుంది.

సీఆర్‌ఈఎన్‌ఎస్‌, అధికారిక లోగోను బిట్స్‌ పలానీ క్యాంపస్‌లో మాజీ డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌. జి.సతీష్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘దేశ సరిహద్దుల నుంచి హెల్త్‌, సైబర్‌ స్పేస్‌ వంటి కీలక అంశాల్లో సీఆర్‌ఈఎన్‌ఎస్‌ దూరదృష్టిని అభినందించారు.

చదవండి: Indigenous Battle Tank : తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం

ప్రస్తుతం ప్రపంచంలో భద్రత అంశాలను సవాలు చేసే​ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సమయంలో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయాల్పిన అవసరం ఎంతగానో ఉంది. ముఖ్యంగా బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌లో సీఆర్‌ఈఎన్‌ఎస్‌ ఏర్పాటు కావటం ఎంతో  ఉపయోగకరం.

హైదరాబాద్‌లోని పలు జాతీయ సంస్థలతో కలిసి పని చేయడానికి దానికి వీలు కలుగుతుంది’’ అని అన్నారు. అనంతరం సీఆర్‌ఈఎన్‌ఎస్‌ వెబ్‌సైట్‌ను డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వీసీ డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి, నేవీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఏవీఎస్‌ఎం, వీఎస్‌ఎం సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్టి సారిన్‌లు ప్రారంభించారు.

చదవండి: National Fire Service College: ఫైర్‌ ఇంజనీరింగ్‌తో ఉద్యోగావకాశాలు.. ఈ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు

ఈ కార్యక్రమంలో బిట్స్‌ పలానీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వీ. రాంగోపాల్‌ రావు మాట్లాడారు. సీఆర్‌ఈఎన్‌ఎస్‌ మూడు రకాలు లక్ష్యాలను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. మొదటిది.. జాతీయ భద్రతా విభాగంలో నిపుణుల నైపుణ్యం మెరుగుపర్చటం, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో హైబ్రిడ్‌ కోర్సులను అందింటం. రెండోది.. సరిహద్దులో సేవలు అందించే సైనికులకు పలు అంశాల్లో కీలకమైన పరిష్కారాలను అందించడానికి పరిశోధన చేయటం.

మూడో లక్ష్యం.. దేశ అవసరాలకు అవసరమైన రక్షణ, అంతరిక్ష వ్యూహాత్మక రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ నూతన ఆష్కరణలకు కృషి​ చేయటం’ అని అన్నారు.

#Tags