ITI Admissions: ఏటీసీలో ఆరు కోర్సులలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

కామారెడ్డి అర్బన్‌: బిచ్కుందలోని ఏటీసీలో ఆ రు కోర్సులలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సంగ్వాన్‌ తెలిపారు.

మ్యాన్‌ఫాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌ (ఏడాది కోర్సు, 40 సీట్లు) ఇండస్ట్రీ రోబోటిక్స్‌ అండ్‌ డి జిటల్‌ మ్యానుఫాక్చరింగ్‌ (ఏడాది కోర్సు, 40 సీ ట్లు) ఆర్టిజన్‌ యూజ్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌ (ఏడాది కోర్సు, 40 సీట్లు), బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైడ్‌ మెకానికల్‌ (రెండేళ్ల కోర్సు, 24సీట్లు), అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌ (రెండేళ్ల కోర్సు, 24 సీట్లు), మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (రెండేళ్ల కోర్సు, 24 సీట్లు) కోర్సులలో ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్సు పూర్తి చేసిన వారికి టాటా కంపెనీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పే ర్కొన్నారు. ఇతర వివరాలకు 98667 57695, 96402 28856 నంబర్లలో సంప్రదించాలని సూ చించారు.

చదవండి: NCC క్యాడెట్లకు శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా!

ఏటీసీతో ఉపాధి అవకాశాలు మెరుగు

బిచ్కుంద: బిచ్కుంద ఐటీఐ కళాశాలలోని అడ్వాన్స్‌ డ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ) ద్వారా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. అక్టోబర్ 27న ఆయన బిచ్కుంద ఐటీఐ కళాశాలలోని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను పరిశీలించారు. ప్రిన్సిపల్‌ ప్రమోద్‌ కుమార్‌తో మాట్లాడి నూతన గదుల పనులు, అడ్మిషన్ల ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐలో కొత్త కోర్సులు వచ్చాయని, విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని సూచించారు.

ఈ కోర్సులపై చుట్టుపక్కల మండలాలలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏటీసీలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. అన్ని కోర్సులలో సీట్లు భర్తీ అయ్యేలా చూడాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, తహసీల్దార్‌ సురేశ్‌, ఎంపీడీవో గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌
 

#Tags