AICTE: సత్తా చాటేలా సిలబస్‌!

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్ల సాంకేతికతను అందిపుచ్చుకొనేలా ఉండాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌లో ఈ మార్పు అనివార్యమని అంటోంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఏఐసీటీఈ నిపుణుల కమిటీ గతేడాది సరికొత్త సీఎస్‌సీ బోధనాంశాలను ప్రతిపాదించింది.

దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులతో చర్చించిన ఈ కమిటీ... సైబర్‌ సెక్యూరిటీ, మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి బోధనాంశాలను కోర్సుల్లో చేర్చాలని సూచించింది. ప్రస్తుతం మూడేళ్లకోసారి యూనివర్సిటీలు ఇంజనీరింగ్‌ సిలబస్‌లో మార్పులు చేస్తున్నప్పటికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత పాఠ్యాంశాలు లేవని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? 

చదవండి: CMOverseas Scheme: మైనారిటీల విదేశీ విద్యకు సర్కార్‌ చేయూత

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌

విద్యార్థికి గణిత శాస్త్రంపై పట్టు ఉండాలి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దీన్ని నాలుగు రెట్లు పెంచేలా బోధనాంశాలుండాలి. కానీ ఇప్పుడున్నసిలబస్‌లో ఈ నాణ్యతకనిపించట్లేదు. ఇంటర్‌లోని సాధారణ గణితశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలే కోర్సులో ఉంటున్నాయి. 

  • రాష్ట్రవ్యాప్తంగా ఏటా 75 వేల మంది కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ కోర్సుల్లో చేరుతున్నారు. క్లిష్టమైన గణిత సంబంధ కోడింగ్‌లో 20 వేల మందే ప్రతిభ చూపుతున్నారు. సీఎస్‌ఈ పూర్తి చేసినా కంపెనీల్లో ఉపయోగించే కోడింగ్‌ను అందుకోవడం వారికి కష్టంగా ఉంటోంది.
  • మెషీన్‌ లెరి్నంగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, డిజైన్‌ థింకింగ్‌ వంటి సరికొత్త ప్రోగ్రామింగ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఆల్‌జీబ్రా, అల్గోరిథమ్స్‌పై పట్టు ఉంటే తప్ప ఈ కోర్సుల్లో రాణించడం కష్టం. ఈ తరహా ప్రయత్నాలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జరగట్లేదనేది ఏఐసీటీఈ పరిశీలన.
  • ఇంజనీరింగ్‌లో కనీసం వివిధ రకాల మైక్రో స్పెషలైజేషన్‌ కోర్సులు అందిస్తే తప్ప కొత్త కంప్యూటర్‌ కోర్సుల్లో విద్యార్థులు పరిణతి చెందరు. ఈ మార్పును ఇంజనీరింగ్‌ కాలేజీలు అర్థం చేసుకోవట్లేదు. దీంతో డీప్‌ లెరి్నంగ్, అడ్వాన్స్‌డ్‌ లెరి్నంగ్‌ వంటి వాటిలో వెనకబడుతున్నారు. 

ఏఐసీటీఈ సూచించిన మార్పులేంటి? 

  • ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌లో గణిత విభాగాన్నివిస్తృతం చేయాలి. పలు రకాల కంప్యూటర్‌ కోడింగ్‌కు సంబంధించిన అల్గోరిథమ్స్, ఆల్‌జీబ్రాతో కూడిన పాఠ్యాంశాలను కొత్తగా జోడించాలి. 
  • కంప్యూటర్స్‌ రంగంలో వస్తున్న నూతన అంశాలగురించి విద్యార్థులు తెలుసుకొనేలా ప్రాక్టికల్‌ బోధనాంశాలను తీసుకురావాలి. వాటిపై కాలేజీల్లోని కంప్యూటర్‌ ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్‌ నిర్వహించాలి. 
  • ఎథికల్‌ ప్రొఫెషనల్‌ రెస్పాన్సిబిలిటీ, రీసెర్చ్‌ అండ్‌అండర్‌స్టాండింగ్, హ్యూమన్‌ వాల్యూస్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సబ్జెక్టులను కోర్సుల్లో చేర్చాలి.దీనివల్ల విద్యార్థులకు సామాజిక అవగాహన కూడా అలవడుతుంది. 

నాణ్యత పెంచాల్సిందే 

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత వేగంగా మారుతోంది. ఇంజనీరింగ్‌ విద్యలో మార్పులు అనివార్యం. భవిష్యత్‌ తరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో బోధన ప్రణాళిక అవసరం. కొన్ని కాలేజీల కోసం ఈ మార్పును ఆపడం ఎలా సాధ్యం?

ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి

ప్రత్యేక క్లాసులు తీసుకోవాలి 
కొత్త సిలబస్‌ను స్వాగతించాలి. స్థాయిని అందుకోలేని విద్యార్థులకు అదనపు అవగాహనకు తరగతులు నిర్వహించాలి. కాలేజీలే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన బోధనాంశాలు ఉండాలని అన్ని వర్గాలు భావిస్తున్నాయి.

ప్రొఫెసర్‌ డి.రవీందర్‌, ఉస్మానియా  యూనివర్సిటీ మాజీ వీసీ

సమస్యేంటి?

రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా వాటిలో 78 కాలేజీలు అటానమస్‌ హోదా పొందాయి. గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీ అందించే సిలబస్‌లో 80 శాతాన్ని ఈ కాలేజీల్లో అమలు చేయాలి. మిగతా 20 శాతం సిలబస్‌ను సొంతంగా తయారు చేసుకోవచ్చు. మారుతున్న సిలబస్‌ను ఈ కాలేజీలు స్వాగతిస్తున్నాయి. 

కానీ మిగతా కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ కాలేజీల్లో లక్షపైన ర్యాంకు పొందిన విద్యార్థులు చేరుతున్నారని.. వాళ్లు అత్యున్నత బోధనా ప్రణాళిక స్థాయిని ఎలా అందుకుంటారని ప్రశ్నిస్తున్నాయి. అయితే నాణ్యతలేని ఇంజనీరింగ్‌ విద్యను చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుందని యూనివర్సిటీలు అంటున్నాయి.

#Tags