B Tech Course Admissions : ఐఐపీఈలో నాలుగేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 165.
» సీట్ల వివరాలు: పెట్రోలియం ఇంజనీరింగ్–62, కెమికల్ ఇంజనీరింగ్–63, మెకానికల్ ఇంజనీరింగ్–40.
» అర్హత: కనీసం 75 శాతం మార్కులతో 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్–2024లో అర్హత సాధించి ఉండాలి.
» ఎంపిక విధానం: జేఈఈ–అడ్వాన్స్డ్ 2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.07.2024
» వెబ్సైట్: https://iipe.ac.in
#Tags