Career Opportunities : మంచి ఉద్యోగాలకు ఈ కోర్సులు చేయాల్సిందే..
సాక్షి ఎడ్యుకేషన్: దేశంలో రోజురోజుకు మెరుగుపడుతున్న రంగం సాంకేతికత. ఇది ప్రతీ రంగంలోనూ తన ప్రభావం చూపిస్తుంది. దీని ఉపయోగం ఇప్పుడు ప్రతీ చోట ఉంటుంది. అయితే, దీంతో ప్రస్తుత కాలంలో సాంకేతిక కోర్సులు ఎంతో ప్రాధాన్యత చూపుతోంది.
Job Opportunities : నిరుద్యోగులకు ఈ వెబ్‌సైట్‌తో ఉపాధి అవకాశాలు.. నేరుగా..
ఉన్నత చదువులు చదివేందుకు కూడా ఎందరో విద్యార్థులు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కోర్సులకు ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది. సమాజంలో మెరుగుపడుతున్న సాంకేతికతతో ఎన్నో రంగాలు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతున్నాయి.
ఈ సాంకేతికతలు మానవ జీవితాల్లో అనేక మార్పులను తీసుకొచ్చింది. రోజురోజుకి మరింత అభివృద్ధి మాత్రమే చెందే రంగం ఇది. ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే, వారందరికీ ఈ రంగంలో కోర్సులతో పాటే అందుకు సంబంధించిన ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. సాంకేతికత అభివృద్దితో కోర్సులు కూడా ఎక్కువవుతున్నాయి. దీంతో నిరుద్యోగులకు కొలువులు అందుబాటులోకి వచ్చే అవకాశం పెరుగుతోంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
సాంకేతికత పెరుగుతున్నప్పటికి, కోర్సులు అందుకు సంబంధించిన ఉద్యోగాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అందులో మొట్టమొదట నిలిచేది మాత్రం వ్యాపార రంగమే.. ప్రస్తుతం, ఉన్న వ్యాపారాల్లో సాంకేతికత అవసరం ఎంతైనా ఉంది. ఈ రంగంలో ప్రతీ విషయం ప్రజలకు చేరువ చేయాలన్న, ఎంత అభివృద్ధి పొందాలన్న కావాల్సింది సాంకేతికత. ప్రతి సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో నిపుణులను నియమించడం కోసం ప్రయత్నిస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి ఉపయోగపడేది ఈ సాంకేతిక రంగమే.
ఈ కోర్సులు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరం..
సాంకేతికతకు సంబంధించి ప్రస్తుతం ఎన్నో ఉద్యోగాలు, కోర్సులు సిద్ధంగా ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధితో కొత్త నైపుణ్యాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీని ఆధారిత ఉద్యోగాలుగా ఉండేవి.. డేటా సైంటిస్ట్, ఏఐ (ఆర్టిఫీషియల్ ఎంటెలిజెన్స్) సైబర్ సెక్యూరిటీ వంటి అవకాశాలు ఉంటాయి. ఇవే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలుగా మారేందుకే నేడు వివిధ కోర్సులను సృష్టిస్తున్నారు.
TGPSC Provisional Selection List: టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల
దీనిలో కెరీర్ అవకాశాలు ఉండడం కారణంగానే డేటా సైన్స్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి వివిధ కోర్సులను రూపోందించారు నిపుణులు. ప్రస్తుతం, వీటికి ఎంతో డిమాండ్ ఉంది. దీంతో రాజోయే కొన్ని నెలల్లోనే ఉద్యోగావకాశలు చుట్టుమట్టే అవకాశం ఎంతగానో ఉంది.
ఉద్యోగావకాశాలు..
సాంకేతికతలో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు అందుకు సంబంధించిన రంగంలోనే కొలువులు దక్కుతాయి. అయితే, కొన్ని నెలల సమయంలోనే 10 నుంచి 12 శాతం నియామకాలు ఉంటాయని, కొన్ని సంవత్సరాల్లోనే లక్షల్లో ఉద్యోగాల భర్తీలు జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలలో జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC), సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో రెండో త్రైమాసికంలో నిపుణులకు డిమాండ్ పెరిగుతుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఇందులో 71 శాతం, సైబర్ సెక్యూరిటీలో 58 శాతం ఉద్యోగావకాశాలు పెరిగాయి. బాగా డిమాండ్ ఉన్న విభాగాల్లో 79 శాతం పెరిగింది. ఈఆర్పి, టెస్టింగ్, నెట్వర్కింగ్, డెవలప్మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలు ఉన్నాయి. జావాలో 30 శాతం, సైబర్ సెక్యూరిటీ 20 శాతం, డెవ్లప్స్ 25 శాతం డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగావకాశాలు 62 శాతం బెంగళూరులో, 43.5 శాతం హైదరాబాద్ లో ఉన్నాయి.