మార్కులు అప్‌లోడ్ చేస్తే ర్యాంకులిస్తాం : ఎన్.యాదయ్య

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌లో కొంతమంది విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కులకు సంబంధించిన సమాచారం ఇవ్వనందునే వారికి ర్యాంకులను కేటాయించలేదని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.యాదయ్య తెలిపారు.
ఇందుకోసం ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో (https://eamcet.tsche.ac.in) వెబ్ లింక్‌ను ఉంచామని తెలిపారు. విద్యార్థులు తమ మార్కులను అప్‌లోడ్ చేయడంతోపాటు ఒరిజినల్ మార్కుల మెమో/తాజా ఇంటర్మీడియట్ హాల్‌టికెట్ (ఏపీ, టీఎస్) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని, వాటి ఆధారంగా వారికి ర్యాంకులను కేటాయిస్తామని వివరించారు. సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి విద్యార్థుల మార్కులను ఇవ్వలేదని, రిజిస్ట్రేషన్ సమయంలో కొంతమంది విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్ నెంబర్లు తప్పుగా వేశారని, ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ ఫలితాలు రాలేదని, ఇతర రాష్ట్ర బోర్డుకు సంబంధించిన వారు మార్కులకు వివరాలు, ఆధారాలు ఇవ్వలేదని, అందుకే వారికి ర్యాంకులను కేటాయించలేదని తెలిపారు. వారు తమ వివరాలను ఇస్తే ర్యాంకులను కేటాయిస్తామని వివరించారు.
#Tags