Engineering Study: ఇంజనీరింగ్‌లో ఎలాంటి బ్రాంచ్‌ సెలక్ట్‌ చేసుకుంటే కెరీర్‌ బావుంటుంది?

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ప్రవేశపరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీటు లభిస్తుంది. త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌లో ఎలాంటి బ్రాంచ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి? ఎలాంటి కాలేజీలో జాయిన్‌ అవ్వాలి? ఇంజనీరింగ్‌తో కెరీర్‌ ఎలా ఉండనుంది వంటి విషయాలపై JNTUH ప్రిన్సిపల్‌ జీవీ నర్సింహారెడ్డి అందించే కెరీర్‌ గైడెన్స్‌ మీకోసం..

►  ఇంజనీరింగ్‌లో ఎలాంటి బ్రాంచ్‌ సెలక్ట్‌ చేసుకోవాలి? ఈ మధ్య అందరూ CSE వైపే మొగ్గుచూపుతున్నారు. బ్రాంచ్‌ ఎంపికలో ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి?

స: కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే కాకుండా అన్ని బ్రాంచ్‌లకు సమానమైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఐటీ జాబ్స్‌ ఎక్కువగా ఉండటంతో స్టూడెంట్స్‌ఎక్కువగా అటువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కంప్యూటర్‌ సైన్స్‌ ఒక్కటే కాదు, ఎలాంటి బ్రాంచ్‌ ఎంచుకున్నా అందులో నాలెడ్జ్‌ ఉండటం ముఖ్యం. అందుకే స్టూడెంట్‌ ఇంట్రెస్ట్‌ని బట్టి బ్రాంచ్‌ని ఎంపిక చేసుకోవాలి. ఏ బ్రాంచ్‌ని ఎంపిక చేసుకుంటే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? లాంగ్‌ టర్మ్‌లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి వంటివన్నీ చూసుకొని బ్రాంచ్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. 


  ఈ మధ్య EEE, మెకానికల్‌ వంటి కోర్‌ సబ్జెక్ట్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వాళ్లు కూడా ఐటీ జాబ్స్‌ వైపే వస్తున్నారు? కారణమేంటి?

ఎందులో అయినా సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ పెంచుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఎలాంటి అవకాశాలను అయినా అందిపుచ్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. తక్కువ సమయంలో ఐటీ రంగంలో ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో స్టూడెంట్స్‌ అటువైపు ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. కానీ కోర్‌ సబ్జెక్ట్స్‌లోనూ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సబ్జెక్ట్‌లో నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. 

► బ్రాంచ్‌, కాలేజీ ఎంపికలో స్టూడెంట్స్‌లో చాలా సందిగ్దం ఉంటుంది. కొందరికి నచ్చిన సీటు వరిస్తే, కాలేజీ నచ్చదు. మరికొందరికి కాలేజీలో తాము కోరుకున్న సీటు దొరకదు.. అలాంటప్పుడు ఏం చేయాలి?
టాప్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్‌ వంటి విషయాలన్నీ బాగానే ఉంటాయి. సో వాళ్ల ఇంట్రెస్ట్‌ని బట్టి బ్రాంచ్‌ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. 


కాలేజీని సెలక్ట్‌ చేసుకునేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి?

న్యాక్‌ ర్యాంకింగ్స్‌, ఫ్యాకల్టీ ఎక్స్‌పీరియన్స్‌, ల్యాబరేటరీస్‌ ఎలా ఉన్నాయి, ప్లేస్‌మెంట్స్‌? ఆ కాలేజీలో ప్లేస్‌మెంట్స్‌ ఎలా జరుగుతున్నాయి? ఏఏ బ్రాంచీల నుంచి ఎంతమంది స్టూడెంట్స్‌ ఎంపిక అవుతున్నారు? వంటి వివరాలను దృష్టిలో ఉంచుకొని కాలేజీని సెలక్ట్‌ చేసుకోవాలి.

► కొన్ని కాలేజీలు MOUతో ఫారిన్‌ కాలేజీలతో అనుసంధానం అవుతుంటాయి. వీటిలో చేరడం మంచిదా? లేదా నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక ఫారిన్‌ వెళ్లడం మంచిదా?

ఇంటిగ్రేటెడ్‌ డ్యుయెల్‌ డిగ్రీ ప్రోగ్రాం అంటారు. కొన్ని కాలేజీల్లోనే ఇలాంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరేళ్లలో పూర్తి అవ్వాల్సిన కోర్సు ఐదున్నరేళ్లలోనే పూర్తవుతుంది. అదే బీటెక్‌ తర్వాత చేస్తే వాళ్ల ఇంట్రెస్ట్‌ని బట్టి ఆ సబ్జెక్ట్స్‌లో స్పెషలైజేషన్‌ చేసే అవకాశం ఉంటుంది. 

►సక్సెస్‌ఫుల్‌ ఇంజనీర్‌ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స​ పెంపొందించుకోవాలి? ఇంటర్‌లో చదివే విధానానికి, ఇంజనీరింగ్‌కి ఎలాంటి తేడా ఉంటుంది?

ఒక మూస పద్ధతిలో చదివితే ఇంజనీరింగ్‌లో సక్సెస్‌ కాలేరు. ఇంటర్‌లో సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌, ఇంజనీరింగ్‌కి వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఒకే ప్రశ్నను వివిధ రకాలుగా ఎలా సాల్వ్‌ చేయొచ్చు అనే ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ కెపాసిటీ పెరుగుతుంది. అందుకు తగ్గట్లు స్కిల్స్‌ పెంచుకోగలిగితేనే ఇంజనీరింగ్‌లో సక్సెస్‌ కాగలరు. సబ్జెక్ట్‌ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడే డిఫరెంట్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనేది అర్థమవుతుంది. 

► చివరగా స్టూడెంట్స్‌ ఎలాంటి ప్లానింగ్‌తో ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది?

మొదటి ఏడాది నుంచే ప్లానింగ్‌ ఉండాలి. ఇంటర్‌ వరకు టీచర్స్‌ గైడెన్స్‌ చాలా ఉంటుంది. కానీ ఇంజనీరింగ్‌లో సెల్ఫ్‌ గైడెన్స్‌, సెల్ప్‌ స్టడీ చాలా అవసరం. ముందునుంచీ బ్యాక్‌లాగ్స్‌ లేకుండా చూసుకోవాలి. మీ కోర్‌ సబ్జెక్ట్స్‌పై బాగా ఫోకస్‌ చేయాలి.సెకండ్‌ ఇయర్‌ నుంచి గేట్‌ సిలబస్‌పై ఫోకస్‌ చేస్తే ఐఐటీలో ఈజీగానే ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ఫారిన్‌లో చదవాలనుకున్నా అందుకు తగ్గట్లు ప్లానింగ్‌, ప్రిపరేషన్‌ ఉండాలి. 

 

 

 

 

 

 

 

 

- JNTUH ప్రిన్సిపల్‌ జీవీ నర్సింహారెడ్డి

#Tags