AP EAMCET 2022 College Predictor : మీ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించి AP EAMCET ఫ‌లితాల‌ను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌కు మంచి కాలేజీలో చేర్పించాలని కోరుకుంటున్నారు. అలాగే AP EAMCETలో వ‌చ్చే ర్యాంక్‌ల‌పై విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో  ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.


ఈఏపీసెట్‌ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీ ఈఏపీసెట్‌–2022 జూలై 4వ తేదీన‌ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన విష‌యం తెల్సిందే.

ఏపీ ఈఏపీసెట్‌–2022 స‌మ‌గ్ర వివ‌రాలు ఇలా..
➤ మొత్తం దరఖాస్తులు: 3,00,111
➤ ఇంజనీరింగ్‌ విభాగంలో దరఖాస్తులు: 2,05,518 (బాలురు 1,21,685, బాలికలు 83,833)
➤ అగ్రికల్చర్‌ విభాగంలో దరఖాస్తులు: 93,532 (బాలురు 28,847, బాలికలు 64,685)
➤ రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు: 1061 (బాలురు 461, బాలికలు 600)
➤ పరీక్షకు హాజరైనవారు: 2,82,496
➤ అర్హత సాధించినవారు: 2,56,983
➤ ఇంజనీరింగ్‌ విభాగంలో అర్హులు: 1,73,572 (బాలురు 1,01,703, బాలికలు 71,869)
➤ అగ్రికల్చర్‌ విభాగంలో అర్హులు: 83,411 (బాలురు 25,771, బాలికలు 57,640)

AP EAMCET 2022లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు.. ఎలాంటి కాలేజీలో సీటు వ‌చ్చే అవ‌కాశం ఉందంటే..?
సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం.. మీకు వ‌చ్చిన AP EAMCET 2022 ర్యాంక్‌ ఆధారంగా.. ఏ కాలేజీలో ప్ర‌వేశం వ‌స్తుందో ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న ఆధారంగానే మీ కాలేజీ కేటాయింపు ఉంటుంది.

AP EAMCET 2021 (Engineering) College Predictor :

How to Check Expected Engineering Colleges?

#Tags