Mega DSC Notification Details: 16,347 డీఎస్సీ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్.. పూర్తివివరాలు ఇవే!
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారైంది. 16,347 పోస్టులతో నవంబర్6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నోటిఫికేషన్ వెలువడిన మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే విద్యసంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్ల వివరాలను DEOల నుంచి వివరాలు సేకరించారు.
మొత్తం 16347 టీచర్ పోస్టులు.. జిల్లాల వారిగా ఖాళీల వివరాలు ఇవే..
16,347 టీచర్ పోస్టులకు జులై 1వ తేదీ DSC 2024 షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెల్సిందే. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాలు ఇవే :
పోస్ట్ | ఖాళీలు | |
1 | ఎస్‌జీటీ | 6,371 |
2 | పీఈటీ | 132 |
3 | స్కూల్ అసిస్టెంట్స్ | 7725 |
4 | టీజీటీ | 1781 |
5 | పీజీటీ | 286 |
6 | ప్రిన్సిపల్స్ | 52 |
ఏపీలోని జిల్లాల వారిగా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే..
జిల్లా | ఖాళీలు | |
1 | శ్రీకాకుళం | 543 |
2 | విజయనగరం | 583 |
3 | విశాఖపట్నం | 1134 |
4 | తూర్పు గోదావరి | 1346 |
5 | పశ్చిమ గోదావరి | 1067 |
6 | కృష్ణా | 1213 |
7 | గుంటూరు | 1159 |
8 | ప్రకాశం | 672 |
9 | నెల్లూరు | 673 |
10 | చిత్తూరు | 1478 |
11 | కడప | 709 |
12 | అనంతపురం | 811 |
13 | కర్నూలు | 2678 |
అలాగే రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.
#Tags