Husband and Wife Success Story : పేదరికంను అనుభ‌వించాం.. ఒకేసారి నేను.. నా భార్య గ‌వ‌ర్న‌మెంట్ జాబ్‌లు కొట్టామిలా.. కానీ...

తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ డీఎస్సీ ఫ‌లితాల్లో ఎంతో మంది నిరుపెద బిడ్డ‌లు త‌మ స‌త్తాచాటి గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ ఉద్యోగాల‌ను సాధించారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్‌ గ్రామానికి చెందిన జంగిలి కృష్ణ, సంగీత దంపతులు.. ఒకేసారి ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరు నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు. పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపించారు. ప్రేమవివాహం చేసుకున్నారు. కష్టపడి చదివి ఏకంగా ఒకేసారి ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు ఈ దంపతులు. 

➤☛ Inspirational Success Story : కూలీ పనులకు వెళ్తూ.. అన్న, త‌మ్ముడు, చెల్లి.. అంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించారిలా.. కానీ..!

ఇద్దరు పిల్లలు పుట్టిన త‌ర్వాత‌..
వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా చదువుకోవాలనే ఆకాంక్షతో ప్రత్యేక బీఈడీ చేశారు. 2016లో ప్రభుత్వం నిర్వహించిన టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌)లో ఉత్తీర్ణత సాధించారు. కృష్ణ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ప్రభుత్వం డీఎస్సీ వేయడంతో ప్రిపేర్‌ అయ్యాడు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో ఇద్దరూ డీఎస్సీకి ఎంపికయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్‌ అందుకున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి.. చదువుతోనే జీవితాల్లో వెలుగు నింపుతుందంటున్నారు ఈ దంపతులు.

#Tags