WTC : లార్డ్స్‌లో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌కు ఈసారి ఇంగ్లండ్‌లోని విఖ్యాత లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది.

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌కు ఈసారి ఇంగ్లండ్‌లోని విఖ్యాత లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది. వచ్చే ఏడాది జూన్‌ 11 నుంచి 15 వరకు లార్డ్స్‌ మైదానంలో డబ్ల్యూటీసీ తుది పోరు జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ప్రకటించింది. ఫైనల్‌ మ్యాచ్‌కు 16వ తేదీని రిజర్వ్‌ డేగా కేటాయించింది. ’అతి తక్కువ కాలంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన డబ్ల్యూ టీసీ 2023–25 సీజన్‌ ఫైనల్‌ వచ్చే సంవత్సరం జూన్‌ 11 నుంచి నిర్వహిస్తాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.

Vritti Agarwal: జాతీయ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయికి స్వర్ణ పతకం

గతంలో జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇంగ్లండ్‌ లోని సౌతాంప్టన్‌ (2021), ఓవల్‌ (2023) ఆతిథ్యమివ్వగా... ఈసారి లార్డ్స్‌లో ప్రతిష్టాత్మక మ్యాచ్‌ జరగనుంది. గత రెండు ఎడిషన్‌లలోనూ ఫైనల్‌ చేరిన భారత జట్టు రెండు పర్యాయాలూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోగా... న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

Cash Rewards: పారాలింపిక్స్‌లో విజేతలకు నజరానా ఇచ్చిన క్రీడా శాఖ మంత్రి.. ఎంతంటే..

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా... ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ సీజన్‌ ముగిసే సమయానికి అనుకూల వాతావరణం, విశ్వవ్యాప్త అభిమానులకు వీక్షణ సమయం కూడా అనుకూలంగా ఉండటంతో.. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహణకు ఇంగ్లండ్‌ సరైన వేదిగా ఐసీసీ భావిస్తోంది. వరుసగా నాలుగో డబ్ల్యూటీసీ ఫైనల్‌ కు కూడా ఇంగ్లండ్‌ 2027లో ఆతిథ్యమిస్తుంది.

Sahaja: భారత మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌గా నిలిచిన తెలుగమ్మాయి

#Tags