World Badminton Championship 2022 : ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్న ఐదో ప్లేయర్‌గా అకానె యామగుచి (జపాన్‌) గుర్తింపు పొందింది.

ఫైనల్లో యామగుచి 21–12, 10–21, 21–14తో చెన్‌ యు ఫె (చైనా)పై నెగ్గింంది. గతంలో హాన్‌ ఐపింగ్‌ (చైనా; 1985, 1987), యె జావోయింగ్‌ (చైనా; 1995, 1997), జీ జింగ్‌ఫాంగ్‌ (చైనా; 2005, 2006), కరోలినా మారిన్‌ (స్పెయిన్‌; 2014, 2015) మాత్రమే వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచారు.

#Tags