ODI WC 2023: వరల్డ్ కప్‌లో భారత్ ఆడనున్న మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే...
వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ కోసం బరిలోకి దిగే పది జట్లపై స్పష్టత వచ్చేసింది. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ టాప్-8లో ఉన్నాయి.
ఇక అర్హత మ్యాచ్‌లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్ టాప్-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లతోనే అర్హత సాధించింది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి...
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. ఎంతమంది పాస్ అయ్యారంటే..
దేశం | తేదీ | వేదిక |
భారత్ X ఆస్ట్రేలియా | అక్టోబర్ 8 | చెన్నై |
భారత్ X అఫ్గానిస్థాన్ | అక్టోబర్ 11 | దిల్లీ |
భారత్ X పాకిస్థాన్ | అక్టోబర్ 15 | అహ్మదాబాద్ |
భారత్ X బంగ్లాదేశ్ | అక్టోబర్ 19 | పుణె |
భారత్ X న్యూజిలాండ్ | అక్టోబర్ 22 | ధర్మశాల |
భారత్ X ఇంగ్లాండ్ | అక్టోబర్ 29 | లక్నో |
భారత్ X శ్రీలంక | నవంబర్ 2 | ముంబయి |
భారత్ X దక్షిణాఫ్రికా | నవంబర్ 5 | కోల్‌కతా |
భారత్ X నెదర్లాండ్స్ | నవంబర్ 11 | బెంగళూరు |
సీఏలో దుమ్మురేపిన హైదరాబాద్ కుర్రాడు.. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన శ్రీకర్
#Tags