Charvi Anilkumar: చిన్న‌ వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు

బెంగళూరుకు చెందిన చార్వి అనిల్‌ కుమార్‌ చదరంగంలో అద్భుతాలు చేస్తుంది.

తొమ్మిదేళ్ల వయసులోనే ఈ అమ్మాయి మేధావుల ఆటలో సంచలనాలు సృష్టిస్తుంది. అసాధారణ నైపుణ్యాలు కలిగిన ఈ అమ్మాయి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ (11 ఏళ్లలోపు) ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 

చార్వి 2022లో అండర్‌-8 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం ద్వారా తొలిసారి వార్తల్లోకెక్కింది. ఆ పోటీల్లో అగ్రస్థానంలో నిలువడం ద్వారా 1900 ఎలో రేటింగ్‌ పాయింట్ల మార్కును అధిగమించి, ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అనంతరం జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్లలోనూ చార్వి తన విజయపరంపరను కొనసాగించింది.

ఏకంగా ఐదు బంగారు పతకాలు..
ఈ చెస్‌ చిచ్చరపిడుగు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో (అండర్ 8) ఏకంగా ఐదు బంగారు పతకాలు, ఓ రజత పతకం సాధించి, చెస్‌ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా చార్వికి ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) బిరుదు దక్కింది.

చార్వి.. 2022 అక్టోబర్‌లో తన మూడో మేజర్‌ టైటిల్‌ను సాధించి, చెస్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చార్వి ఛాంపియన్‌గా నిలిచి హేమాహేమీల ప్రశంసలను అందుకుంది.

తాజా ర్యాంకింగ్స్‌లో 1915 రేటింగ్‌ పాయింట్లు కలిగి, ఫిడే ర్యాంకింగ్స్‌లో (జూనియర్ బాలికల విభాగం) అగ్రస్థానంలో నిలిచిన ఈ బాలిక‌, ఈ ఏడాది చివరికల్లా 2200 లేదా 2300 ఎలో రేటింగ్‌ పాయింట్లు సాధించాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలిపింది. చార్వి ప్రస్తుతం బెంగళూరులోని క్యాపిటల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నాలుగో గ్రేడ్‌ చదువుతుంది. ఈ చిన్నారి ఆర్‌బీ రమేశ్‌ వద్ద చెస్‌ ఓనమాలు నేర్చుకుంది. చార్వి తండ్రి అనిల్‌ కుమార్‌ బెంగళూరులోనే ఓ ఎంఎన్‌సీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తల్లి అఖిల ఉద్యోగం మానేసి చార్వికి ఫుల్‌టైమ్‌ సపోర్ట్‌గా ఉంది.

Arjuna Awards 2023: అర్జున అవార్డు అందుకున్న షమీ.. ఎంత మంది క్రీడాకారులు ఈ అవార్డు తీసుకున్నారంటే..?

#Tags