Asian Games 2023: భార‌త్‌కు హెప్టాథ్లాన్‌లో కంచు ప‌త‌కం

గత కొంత కాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెట్‌ అగసార నందిని అసలు సమయంలో తన ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారి కాంస్యంతో మెరిసింది.
Nandini Agasara wins bronze in women’s heptathlon

ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌లో నందిని మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5712 పాయింట్లు సాధించింది. హెప్టాథ్లాన్‌లోని తొలి ఆరు ఈవెంట్లు ముగిసేసరికి నందిని ఐదో స్థానంలో నిలిచింది.

Asian Games Shooting: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు

2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసి

100 మీటర్ల హర్డిల్స్‌ (4వ స్థానం), హైజంప్‌ (9వ స్థానం), షాట్‌పుట్‌ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్‌ (3వ స్థానం), జావెలిన్‌ త్రో (9వ స్థానం)... ఇలా వరుసగా ఆమె ప్రదర్శన కొనసాగింది.
అయితే చివరి ఈవెంట్‌ 800 మీటర్ల పరుగులో సత్తా చాటడంతో కాంస్యం ఖాయమైంది. ఈ పరుగును 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసిన నందిని అగ్ర స్థానంలో నిలిచింది. దాంతో ఓవరాల్‌ పాయింట్లలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది.

2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన మరో భారత అథ్లెట్‌ స్వప్న బర్మన్‌ చివరి వరకు పోటీలో నిలిచినా... ఓవరాల్‌గా 5708 పాయింట్లతో నాలుగో స్థానానికే పరిమితమైంది.

Asian Games Rifle: రైఫిల్‌లో భారత్‌కు రజతం

#Tags