IPL 2024: ఐపీఎల్‌-17 చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రన్నరప్ సన్‌రైజర్స్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే..!

పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచింది.

మే 26వ తేదీ చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌ పోరులో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. దీంతో కేకేఆర్ ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. 

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు  ఇదే. అనంతరం నైట్‌రైడర్స్‌ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది.    

విజేత‌కు ఎన్ని కోట్లంటే?
విజేతగా నిలిచిన కేకేఆర్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు, ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్న హైదరాబాద్‌ జట్టుకు రూ.12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి రూ.6.5 కోట్లు అందాయి.

Female Cricket: టీ20లో భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్

ఐపీఎల్‌–17 బౌండరీ మీటర్‌ 
మొత్తం సిక్స్‌లు: 1260 
మొత్తం ఫోర్లు: 2174 

ఆరంజ్ క్యాప్‌
అత్య‌ధిక ప‌రుగులు తీసిన బ్యాట‌ర్.. విరాట్ కోహ్లీ(బెంగ‌ళూరు).. 741 ప‌రుగులు(15 మ్యాచ్‌లు)
ప్రైజ్‌మ‌నీ: రూ.10 ల‌క్ష‌లు

ప‌ర్పుల్ క్యాప్‌
అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్.. హ‌ర్ష‌ల్ ప‌టేల్(పంజాబ్ కింగ్స్‌).. 24 వికెట్లు(14 మ్యాచ్‌లు)
ప్రైజ్‌మ‌నీ: రూ.10 ల‌క్ష‌లు

ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్‌
నితీన్ కుమార్ రెడ్డి(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)
ప్రైజ్‌మ‌నీ: రూ.10 ల‌క్ష‌లు
13 మ్యాచ్‌ల్లో 303 ప‌రుగులు, 3 వికెట్లు, రెండు అర్ధ‌సెంచ‌రీలు, 21 సిక్స్‌లు, 15 ఫోర్లు

మోస్ట్‌ వాల్యుబుల్ ప్లేయ‌ర్ 
సునీల్ న‌రైన్‌(కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
ప్రైజ్‌మ‌నీ: రూ.10 ల‌క్ష‌లు
15 మ్యాచ్‌ల్లో 488 ప‌రుగులు, 17 వికెట్లు, 1 సెంచ‌రీ, 3 అర్ధ‌సెంచ‌రీలు 

బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ: ర‌ణ‌దీప్‌సింగ్(కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

ఫెయిర్ ప్లే అవార్డు: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ICC Rankings: వన్డే, టీ20ల్లో భారత్ నంబర్ 1.. టెస్టుల్లో ఎన్నో స్థానంలో ఉందంటే..

అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట‌ర్ 
అభిషేక్ శ‌ర్మ‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌).. 16 మ్యాచ్‌ల్లో 42 సిక్స్‌లు

అత్య‌ధిక ఫోర్లు కొట్టిన బ్యాట‌ర్
ట్ర‌విస్‌హెడ్(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌).. 16 మ్యాచ్‌ల్లో 64 ఫోర్లు

ఐపీఎల్‌-17 జ‌రిగిన వేదికలు ఇవే..
ఐపీఎల్‌-2024 సీజన్‌లో ముంబై(ముంబై ఇండియన్స్‌), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్‌), చెన్నై(చెన్నై సూపర్‌ కింగ్స్‌), కోల్‌కతా(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌), చండీఘర్(పంజాబ్‌ కింగ్స్‌)‌, హైదరాబాద్(సన్‌రైజర్స్‌)‌, బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్‌ జెయింట్స్‌), అహ్మదాబాద్(గుజరాత్‌ టైటాన్స్‌)‌, జైపూర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)లలో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు జరగగా.. గువాహటి(రాజస్తాన్‌ రాయల్స్‌), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్‌), ధర్మశాల(పంజాబ్‌ కింగ్స్‌)‌ మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించారు.

#Tags