Tennis Tournament: ఐటీఎఫ్‌ డబుల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన జోడీ?

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–హుమేరా బహార్మస్‌ జంట చాంపియన్‌గా నిలిచింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఫిబ్రవరి 19న ముగిసిన ఈ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో రష్మిక–హుమేరా జంట 6–3, 1–6, 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ పునిన్‌ కొవాపితుక్‌డెట్‌ (థాయ్‌లాండ్‌)–అనా ఉరెకె (రష్యా) జోడీపై గెలిచింది. రష్మిక–హుమేరాలకు ఇదే తొలి ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.

సాకేత్‌ మైనేని ఏ క్రీడకు చెందినవాడు?

బెంగళూరు ఓపెన్‌–2 ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేనికి నిరాశ ఎదురైంది. డబుల్స్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ (భారత్‌) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్‌–రామ్‌ద్వయం 3–6, 7–6 (7/4), 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఎర్లెర్‌ (ఆస్ట్రియా)–అర్జున్‌ ఖడే (భారత్‌) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

చ‌ద‌వండి: ఖతర్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన జంట?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీ డబుల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన జోడీ?
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు    : భమిడిపాటి శ్రీవల్లి రష్మిక(హైదరాబాద్‌)–హుమేరా బహార్మస్‌ జంట(హైదరాబాద్‌)
ఎక్కడ    : గురుగ్రామ్, హరియాణ
ఎందుకు : డబుల్స్‌ ఫైనల్లో రష్మిక–హుమేరా జంట 6–3, 1–6, 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ పునిన్‌ కొవాపితుక్‌డెట్‌ (థాయ్‌లాండ్‌)–అనా ఉరెకె (రష్యా) జోడీపై గెలిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags