IPL 2023 : ఐపీఎల్‌-2023 వేలం.. ప్రముఖ ప్లేయర్లు వీరే.. అత్య‌ధికంగా..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 సీజన్‌ మినీ వేలం డిసెంబర్ 23వ తేదీన‌ మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్‌లో ప్రారంభంకానుంది.
IPL 2023 Auction

ఈ వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్‌ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్‌ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్‌లో బ్యాటర్లు, రెండో సెట్‌లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్‌లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్‌లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్‌లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్‌ల వారీగా జరుగనుంది.రెండో సెట్‌లో ఉన్న ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఈ సెట్‌లో ఉన్న విదేశీ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, కామెరూన్‌ గ్రీన్‌, సామ్‌ కర్రన్‌, షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్ భారీ ధర పలికే ఛాన్స్‌ ఉంది. తొలి సెట్‌లో ఉన్న బ్యాటర్లలో రిలీ రోస్సో, హ్యారీ బ్రూక్‌ జాక్‌పాట్‌ కొట్టే ఛాన్స్‌ ఉండగా.. నికోలస్‌ పూరన్‌, ఆదిల్‌ రషీద్‌, దేశీయ సంచలనం, తమిళనాడు ఆటగాడు ఎన్‌ జగదీశన్‌ కూడా భారీ ధర పలకవచ్చు. 

T20 World Cup: ఇంగ్లాండ్‌దే టీ20 ప్రపంచకప్‌

పర్స్‌ వాల్యూ విషయానికొస్తే.. 
లీగ్‌లో పాల్గొనే 10 జట్లు ఇదివరకే రీటైన్‌ చేసుకున్న ఆటగాళ్లపై రూ.743.5 కోట్లు ఖర్చు చేయగా..  ఫ్రాంచైజీల వద్ద ఇంకా రూ.206.5 కోట్ల నిధులు ఉన్నాయి. వేలంలో పాల్గొనే ఫ్రాంఛైజీల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద అత్యధికంగా 42.25 కోట్లు ఉండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వద్ద అత్యల్పంగా 7.05 కోట్ల పర్స్‌ బ్యాలెన్స్‌ ఉంది. 

ఆయా ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్‌ బ్యాలెన్స్‌ వివరాలు ఇలా..

☛ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: రూ. 42.25 కోట్లు
☛ పంజాబ్‌ కింగ్స్‌: రూ. 32.2 కోట్లు 
☛ లక్నో సూపర్‌జెయింట్స్‌: రూ. 23.35 కోట్లు
☛ ముంబై ఇండియన్స్‌: రూ. 20.55 కోట్లు
☛ చెన్నై సూపర్‌కింగ్స్‌: రూ. 20.45 కోట్లు
☛ ఢిల్లీ క్యాపిటల్స్‌: రూ. 19.45 కోట్లు
☛ గుజరాత్‌ టైటాన్స్‌: రూ. 19.25 కోట్లు
☛ రాజస్తాన్‌ రాయల్స్‌: రూ. 13.2 కోట్లు
☛ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: రూ. 8.75 కోట్లు
☛ కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రూ. 7.05 కోట్లు

T20 World Cup 2022 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బెస్ట్ టీమ్ ఇదే.. వాళ్లకు చోటు లేదు.. ఎందుకంటే..?

బేస్‌ ప్రైజ్‌ ఆధారంగా విభజింపబడ్డ ప్రముఖ ప్లేయర్ల వివరాలు ఇవే..
రూ.2 కోట్ల లిస్ట్‌లో ప్లేయర్స్‌: కౌల్టర్‌ నైల్‌, కామెరున్‌ గ్రీన్‌, ట్రెవిస్‌ హెడ్, క్రిస్‌ లిన్‌, టామ్ బాంటన్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, టైమాల్‌ మిల్స్, జేమీ ఓవర్టన్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌, ఆదిల్ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, ఆడమ్‌ మిల్న్‌, జిమ్మీ నీషమ్, కేన్‌ విలియమ్సన్‌, రైలీ రూసో, రాసీ వెండెర్‌ డుసెన్‌, ఏంజెలో మాథ్యూస్, నికోలస్‌ పూరన్‌, జేసన్‌ హోల్డర్‌.

రూ.1.5 కోట్ల లిస్ట్‌లోని ప్లేయర్స్ వీరే: 
సీన్‌ అబాట్‌, రైలీ మెరెడిత్‌, జై రిచర్డసన్‌, ఆడమ్‌ జంపా, షకీబుల్‌ హసన్‌, హ్యారీ బ్రూక్, విల్‌ జాక్స్‌, డేవిడ్‌ మలన్, జేసన్‌ రాయ్‌, షెర్ఫానె రూథర్‌ఫర్డ్‌

రూ.కోటి లిస్ట్‌లోని ప్లేయర్స్ వీరే: 
మయాంక్‌ అగర్వాల్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్ పాండే, మహ్మద్‌ నబీ, ముజీబుర్‌ రెహమాన్‌, మోయిసిస్‌ హెన్రిక్స్‌, ఆండ్రూ టై, జో రూట్‌, లూక్‌ వుడ్‌, మైకేల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, మార్టిన్‌ గప్టిల్‌, కైల్‌ జేమీసన్‌, మాట్‌ హెన్రీ, టామ్‌ లేథమ్, డారిల్‌ మిచెల్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, తబ్రైజ్‌ షంసీ, కుశాల్‌ పెరీరా, రోస్టన్‌ చేజ్‌, రఖీమ్ కార్న్‌వాల్‌, షెయ్‌ హోప్‌, అకీల్ హొస్సేన్‌, డేవిడ్ వీస్‌

T20 World Cup 2022 Final Winner : పాకిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన‌ ఇంగ్లండ్‌.. విజేతకు ప్రైజ్‌మనీ ఎంతంటే?

ఆయా ప్రాంచైజీలు రీటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..
డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్‌ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: 
రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్.

రన్నరప్‌ రాజస్తాన్‌ రాయల్స్‌:
సంజు శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్.

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: 
అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా.

లక్నో సూపర్‌ జెయింట్స్‌: 
కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: 
ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్.

ఢిల్లీ క్యాపిటల్స్‌: 
రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్‌ రెహ్మన్‌, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్.

T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే.. ఇప్పటి వరకు ఈ రికార్డుల‌ను ఎవరూ

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా:  
శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: 
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: 
పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్.

Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?

పంజాబ్‌ కింగ్స్‌: 
శిఖర్ ధవన్ (కెప్టెన్‌), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్‌.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: 
మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: 
జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌: 
ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్‌ హక్ ఫరూఖీ.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా:

కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.

ముంబై ఇండియన్స్: 
రోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా
కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్.

చెన్నై సూపర్ కింగ్స్: 
ఎంఎస్ ధోని (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్‌, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ.

విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: 
డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్.

ICC T20 Rankings 2022: అగ్రస్థానంలో సూర్యకుమార్‌ యాదవ్ .. కోహ్లి ర్యాంక్ మాత్రం ఇంతే..

#Tags