India Mens Junior Hockey: జూనియర్ పురుషుల హాకీలో రన్నరప్‌గా భారత

జర్మనీలో జ‌రుగుతున్న నాలుగు దేశాల జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది.
India Mens Junior Hockey

ఆతిథ్య జర్మనీ జట్టుతో మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 1–6 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. భారత్‌ తరఫున సుదీప్‌ చిర్మాకో (22వని.లో) ఏకైక గోల్‌ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్‌ (15వ ని.లో), బెన్‌ హస్బాచ్‌ (20వ ని.లో), హుగో వాన్‌ (23వ ని.లో), ఫాబియో సీట్జ్‌ (38వ ని.లో), నికాస్‌ బెరెంట్స్‌ (41వ ని.లో), పాల్‌ గ్లాండెర్‌ (43వ ని.లో) ఒక్కోగోల్‌ సాధించారు. 

Open Masters-1000 Title Winner: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టైటిల్‌ విజేత‌గా జొకోవిచ్‌

#Tags