FIH Men’s Hockey Pro League: ఎఫ్‌ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్ ‘టాప్’లోకి భారత్
Sakshi Education
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు మళ్లీ ‘టప్’ ర్యాంక్‌లోకి వచ్చింది.
జూన్ 7న రాత్రి నెదర్లాండ్స్ జట్టు చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్.. జూన్ 8న జరిగిన మ్యాచ్‌లో 3–0 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టును ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (33వ ని.లో), అమిత్ రోహిదాస్ (39వ ని.లో), అభిషేక్ (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ప్రొ లీగ్‌లో ఇప్పటి వరకు భారత్ 14 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 27 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్ 26 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
Published date : 09 Jun 2023 03:16PM