T20 World Cup: బంగ్లాదేశ్‌లో కాదు.. యూఏఈలో టీ20 ప్రపంచకప్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ నుంచి యూఏఈకి తరలిపోయింది.

బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి తరలివెళ్లింది. 

ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆగ‌స్టు 20వ తేదీ ప్రకటన విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగగా.. ముందు జాగ్రత్తగా మహిళల టోర్నీని అక్కడి నుంచి తరలించినట్లు ఐసీసీ వెల్లడించింది. దీంతో అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు దుబాయ్, షార్జాలో మహిళల తొమ్మిదో టి20 ప్రపంచకప్‌ జరగనుంది.

‘మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో మెగా టోర్నీని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. బీసీబీ ఆతిథ్యంలోనే యూఏఈలో మహిళల టీ20 వరల్డ్‌కప్‌ జరుగుతుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌కు మరిన్ని ఐసీసీ టోర్నీలు నిర్వహించే అవకాశం ఇస్తాం. మహిళల వరల్డ్‌కప్‌ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యూఏఈ క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జెఫ్‌ అలార్‌డైస్‌ తెలిపారు.

Paris Olympics: ముగిసిన ఒలింపిక్స్.. ఎక్కువ‌ పతకాలు సాధించిన దేశాలివే! 2028 ఒలింపిక్స్ ఎక్క‌డంటే..

#Tags