Women T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత జట్టు.. మ్యాచ్‌లు ఇవే..

బంగ్లాదేశ్‌ నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టీ20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) విడుదల చేసింది.

అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్‌) నిర్వహిస్తారు. 

రెండు మ్యాచ్‌లు ఉంటే.. భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం గం.3:30 నుంచి... రెండో మ్యాచ్‌ రాత్రి గం.7:30 నుంచి జరుగుతాయి. టాప్‌–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. 

భారత జట్టు మ్యాచ్‌లు ఇవే.. 
తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో.. 
అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో 
అక్టోబర్‌ 9న శ్రీలంకతో
అక్టోబర్‌ 13న ఆ్రస్టేలియాతో..
భారత్‌ సెమీఫైనల్‌ చేరుకుంటే అక్టోబర్‌ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్‌ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్‌ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్‌ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్లున్నాయి. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 1 వరకు 10 ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

Women Under 19 World Cup Schedule : మహిళల అండర్‌–19 టీ20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదల

టీ20 వరల్డ్‌కప్ భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్‌)*, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్*, సంజన సజీవన్

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ (వికెట్‌కీపర్‌), తనూజా కన్వర్, సైమా ఠాకూర్
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా

#Tags