Cricket: ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?
కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో 2021–2022 క్రికెట్ సీజన్‌ను భారత జట్టు టి20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించింది. మే 4తో 2021–2022 అంతర్జాతీయ క్రికెట్ సీజన్ కటాఫ్ తేదీ పూర్తయింది. గత ఏడాది కాలంలో టీమిండియా 17 టి20 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. 270 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో ర్యాంక్‌లో... 261 పాయింట్లతో పాకిస్తాన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి.
GK Awards Quiz: 'ఏ నేషన్ టు ప్రొటెక్ట్' పుస్తక రచయిత?
టెస్టు ఫార్మాట్‌లో..
టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా 128 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 119 పాయింట్లతో భారత్ రెండో ర్యాంక్‌లో... 111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో ర్యాంక్‌లో నిలిచాయి.
వన్డే ఫార్మాట్‌లో..
వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్ 125 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 124 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో ర్యాంక్‌లో... 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో ర్యాంక్‌లో... 105 పాయింట్లతో భారత్ నాలుగో ర్యాంక్‌లో... 104 పాయింట్లతో పాకిస్తాన్ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–2022 క్రికెట్ సీజన్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?
ఎప్పుడు : మే 04
ఎవరు : భారత క్రికెట్ జట్టు
ఎందుకు : గత ఏడాది కాలంలో టీమిండియా 17 టి20 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసి.. 270 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్